ETV Bharat / city

వ్యక్తి నమూనాతో కేక్​ తయారు.. మీరెప్పుడైనా చూశారా?

author img

By

Published : Oct 11, 2020, 10:55 PM IST

పుట్టిన రోజులు.. పెళ్లి వేడుకలు.. సినీ వేడుకులు.. పదవీ విరమణ ఇలా ఏ వేడుకలైనా ఏదో రకంగా ఇతరుల్ని సర్ ప్రైజ్ ఇవ్వాలని అందరూ భావిస్తుంటారు. తల్లిదండ్రులు తన పిల్లలకి లేదా స్నేహితులకు, గురువులకు, బంధువులకు ప్రతి వేడుకలో ఒక కొత్త అనుభూతిని మిగిల్చాలని అనుకుంటారు. ఈ తరహా ఎక్కువ మంది కేక్​లపై వ్యక్తి ప్రతిరూపాన్ని చిత్రించడం నిన్నటి వరకు ట్రైండ్​గా ఉంది. అయితే మార్కెట్​లోకి కొత్త ట్రైండ్ వచ్చింది. ప్రధాన వ్యక్తి నమూనాతో ఉన్న శిల్పం కేక్​పై నిర్మిస్తున్నారు. ఇవే బస్ట్ కేక్​లు..అంతర్జాతీయంగా పేరుపొందిన ఈ బస్ట్ కేక్​లు ఇప్పుడు నగరాన్ని పలకరించాయి. ఆ వివరాలేంటో చుద్దామా.

వ్యక్తి నమూనాతో కేక్​ తయారు.. మీరెప్పుడైనా చూశారా?
వ్యక్తి నమూనాతో కేక్​ తయారు.. మీరెప్పుడైనా చూశారా?

భాగ్యనగరం హైదరాబాద్​లో బస్ట్ కేక్​ల తయారీ కొత్తగా వచ్చింది. ఓ అభిమాని తన హీరోకు, ఓ తండ్రి తన కూతురికి, అభిమాన గాయనికి ఆ కేక్​లను సర్ ప్రైజ్​లుగా ఇస్తున్నారు. ఇటీవలే మొదలైన ఈ పోకడకు ఆజ్యం పోసింది హైదరాబాద్​కు చెందిన డి.రాధ. సరదాగా నేర్చుకున్న విద్య ప్రస్తుతం ఆమెకు ఓ వ్యాపారం ప్రారంభించేలా చేసింది. సినిమా వేడుకలకు, ప్రముఖుల పుట్టిన రోజులకు బస్ట్ కేక్​లను ఆర్డర్ మీద తయారుచేసి పంపిస్తున్నారు.

తయారీ కోసం

దిల్లీలో ఉన్న సమయంలో శిల్పాలను నేర్చుకోవడంలో శిక్షణ పొందిన రాధ ఆనంతరం అనేక శిల్పాలను మలిచారు. ఈజిప్టు బొమ్మ, సరోజిని నాయుడు, రాబిన్ విలియంసన్, మలాలా తదితర ప్రముఖుల శిల్పాలను ఆమె చెక్కారు. రాధ తన కూతురి పుట్టిన రోజు వేడుకలకు తొలిసారిగా బస్ట్ కేక్ ను తయారు చేశారు. శిల్పాలను తయారుచేసే నైపుణ్యాన్ని కేక్​పై ఎందుకు ప్రయోగించకూడదని ఆలోచించి తొలి ప్రయత్నం చేశారు. బస్ట్ కేక్ తయారీ కోసం మెల్ట్ చేసిన చాక్ లేట్, శరీరాకృతికోసం కేక్, రైస్ రెసిపీలను వాడి తన కూతురి ముఖ నమూనాతో బస్ట్ కేక్​ను తయారు చేసి అందర్నీ అబ్బురపరిచారు.

టాలీవుడ్ ప్రముఖుల నమునా

అప్పటి నుంచి తన బంధువులు, స్నేహితులు తమ పిల్లల పుట్టిన రోజులకు అలాంటి కేక్​ను తయారు చేయాలంటూ చెప్పడం మొదలు పెట్టారు. అలా నెమ్మదిగా బయటివాళ్లు ఆర్డర్లు ఇవ్వడం వల్ల సరదాగా నేర్చుకున్న విద్య వ్యాపారంగా మారిపోయింది. సుమారు రెండు సంవత్సరాలు నైపుణ్యం సాధించిన తర్వాత టాలీవుడ్ ప్రముఖుల ముఖ నమూనాలతో బస్ట్ కేక్​లను తయారు చేయడం మొదలు పెట్టారు. అలా నాగబాబు, సునీత, చిరంజీవి నమూనాలతో బస్ట్ కేక్​లను వారి అభిమానులకు అందించారు. సైరా నర్సింహారెడ్డి సినిమా విడుదల సమయంలో ఓ అభిమాని బస్ట్ కేక్​ను చిరంజీవికి అందించారు.

ఇతరులకు ట్రైనింగ్​

మూడేళ్ల క్రితం పర్టిక్యులర్ థీమ్​తో మరవలేని, ప్రముఖ నటులపై అంతర్జాతీయ ఆర్టిస్టులందరూ రకరకాల కేక్​లను తయారు చేయాలని చెప్పారు. అందులో తాను రాబిన్ విలియంసన్ నమానా శిల్పాన్ని కేక్​పై చెక్కారు. ఇంగ్లండ్ లేడీ, ఒడిస్సీ డ్యాన్స్ గర్ల్ నమూనాలతో బస్ట్ కేక్​లను చెక్కారు. తాను నేర్చుకున్న విద్యను ఇతరులకు పంచాలనే ఉద్దేశంతో ఇటీవలే కార్యశాలలు ప్రారంభించారు. ప్రస్తుతం నగరంలోని మహిళలు ఎక్కువ మంది ఈ బస్ట్ కేక్ తయారీ నైపుణ్యం పెంపొందించుకునే పనిలో పడ్డారు. బాంబేలోని జహంగీర్ ఆర్ట్ గ్యాలరీలో మార్చి 24 నుంచి 30 వరకు బ్రాంజ్ స్కల్ప్చర్​తోపాటు బెస్ట్ కేక్ స్కల్ ప్చర్స్ ను ప్రదర్శించబోతున్నారు.

కేక్ మాస్టర్స్ మాగజైన్​లో పొందుపరిచిన బస్ట్ కేక్​లలో టాప్ 10 స్థానాల్లో రాధ తయారు చేసిన కేక్​ స్థానం పొందింది. 2018లో ఇండియాస్ టాప్-10 కేక్ ఆర్టిస్ట్​గా అవార్డు పొందారు. గ్లోబల్ ఘగర్ ఆర్టిస్ట్ నెట్ వర్క్ పోటీల్లో ఐదో స్థానాన్ని పొందారు.

ఇదీ చూడండి :

విజయవాడ హత్య కేసు ప్రత్యక్ష సాక్షి దినేష్‌ ఏమన్నాడంటే..?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.