ETV Bharat / city

Harassment: ఆ సమయంలో ఫొటోలు, వీడియో తీశాడు.. ఆ తర్వాత... - hyderabad latest news

పిల్లలు లేరని.. అదనపు కట్నం కావాలని అత్తమామ సూటిపోటి మాటలు ఒకవైపు.. ఏకాంత సమయంలో ఉన్న ఫొటోలను, వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ భర్త బెదిరింపులు మరోవైపు.. భరించలేని ఓ బాధితురాలు బంజారాహిల్స్‌ ఠాణాలో ఫిర్యాదు చేశారు.

harassment
harassment
author img

By

Published : Sep 4, 2021, 9:25 AM IST

హైదరాబాద్​ బంజారాహిల్స్‌ రోడ్‌ నెంబర్​ 11లో నివసించే ఓ మహిళ(24) 2016లో ఎంబీఏ పూర్తి చేశారు. ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు చేస్తున్నప్పుడు సికింద్రాబాద్‌లోని గన్‌రాక్‌ ఎన్‌క్లేవ్‌కు చెందిన మహ్మద్‌ ఫర్హాన్‌(26)తో పరిచయం ఏర్పడింది. వీరి పెళ్లికి 2017లో ఇరు కుటుంబాలు అంగీకరించాయి. దాదాపు రూ.కోటిన్నర ఖర్చుతో మహిళ తండ్రి వివాహం చేయడంతో పాటు మరో రూ.కోటిన్నర విలువైన బంగారు వజ్రాభరణాలను కట్నంగా అందించారు.

వరుడి కుటుంబసభ్యులకు ఖరీదైన నగలను అందించారు. మొత్తం నగలను ఆమె అత్త ఆయేషా ఒస్మాన్‌(53) భద్రపరుస్తానంటూ తీసుకున్నారు. శుభకార్యాలకు వెళ్లే సమయంలో అడిగితే ఇచ్చేవారు కాదు. భార్యతో ఏకాంతంగా ఉన్నప్పుడు భర్త ఫొటోలు, వీడియోలు తీశాడు. పిల్లలు లేరని అత్తమామలు వేధించసాగారు. కారుకు డబ్బులివ్వాలని భర్త వేధించేవాడు. తాను తీసిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో పెడతానంటూ బెదిరించడమే కాకుండా.. పలుమార్లు తీవ్రంగా కొట్టాడు. గురువారం రాత్రి బాధిత మహిళ ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె భర్తతో పాటు అత్తమామలు ఆయేషా ఉస్మాన్‌, మహ్మద్‌ ఒస్మాన్‌లపై వరకట్నం, వేధింపుల కింద కేసులు నమోదు చేశారు.

ఇదీ చూడండి: Gold Theft Case: ఆభరణాల చోరీ కేసు ఛేదించిన పోలీసులు.. నమ్మకస్థుడే అసలు దొంగ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.