ETV Bharat / city

ప్రకాశం బ్యారేజీకి పోటెత్తిన వరద..లోతట్టు ప్రాంతాలు అప్రమత్తం - ప్రకాశం బ్యారేజీకి భారీ వరద వార్తలు

కృష్ణా నదికి వరద పోటెత్తుతోంది. ఎగువ నుంచి వస్తోన్న ప్రవాహంతో నది ఉగ్రరూపం దాల్చుతోంది. ప్రకాశం బ్యారేజి నుంచి దిగువకు భారీగా నీటిని దిగువకు వదులుతున్నారు. నేటి ఉదయానికి ప్రవాహం 9 లక్షల క్యూసెక్కులు దాటొచ్చని కృష్ణా జిల్లా కలెక్టర్‌ ఇంతియాజ్‌ తెలిపారు. జిల్లాలోని అనేక గ్రామాలు ఇంకా ముంపులోనే నానుతున్నాయి.

h0eavy flood inflow to krishna river
h0eavy flood inflow to krishna river
author img

By

Published : Oct 17, 2020, 4:24 AM IST

కృష్ణమ్మ ఉగ్రరూపం సంతరించుకుంది. భారీ వర్షాలకు తోడు ఎగువ నుంచి వస్తోన్న వరదతో....ఉవ్వెత్తున కిందకు తరలుతోంది. ప్రకాశం బ్యారేజి నుంచి 8 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతుండగా.....ఈ రోజు 9 లక్షల క్యూసెక్కులు దాటుందని అధికారులు అంచనా వేశారు. పులిచింతల ప్రాజెక్టు నుంచి వదిలిన 8.6 లక్షల క్యూసెక్కుల వరద నీటికి....మున్నేరు, కట్లేరు నుంచి వచ్చే 70 వేల క్యూసెక్కుల నీరూ కలుస్తోంది. ప్రస్తుతం బ్యారేజి వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. వరద కారణంగా అప్రమత్తంగా ఉండాలని లోతట్టు ప్రాంతాల ప్రజలకు జిల్లా యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది. కృష్ణాజిల్లాలో నదీ పరివాహక ప్రాంతంలో ఉన్న 18 మండలాలు వరదనీటికి ప్రభావితం అయ్యే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు.

వరద ప్రభావంతో జిల్లాలోని అనేక ప్రాంతాలు ఇంకా నీటిలోనే నానుతున్నాయి. పొలాల్లోని పంట కుళ్లిపోతోంది. వందలాది ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. ఇప్పటికే రెండు సార్లు వచ్చిన వరదతో తీవ్రంగా నష్టపోయామంటున్న రైతులు....ప్రస్తుత ముంపుతో కోలుకోలేమని అంటున్నారు. జగ్గయ్యపేట మండలంలోని రావిరాలలోని ముంపు ప్రాంతాల్లో ప్రభుత్వ విప్‌ సామినేని ఉదయబాను పర్యటించారు. పంట పొలాలను పరిశీలించారు. అధికారులు అప్రమత్తంగా ఉన్నారని చెప్పారు. దివిసీమలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో రాష్ట్ర వ్యవసాయ మిషన్‌ వైస్‌ ఛైర్మన్‌ ఎం.వీ.ఎస్‌ నాగిరెడ్డి పర్యటించారు. రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. నష్టపోయిన ప్రతి ఒక్క రైతుకు పరిహారం అందేలా చూస్తామని భరోసా ఇచ్చారు.

విపత్తులో ప్రజలను రక్షించాల్సిన ప్రభుత్వం బాధ్యత మరిచిందని మాజీ మంత్రి దేవినేని ఉమ మండిపడ్డారు. కృష్ణాజిల్లా ఇబ్రహీంపట్నం మండలం దాములూరులో నీట మునిగిన పంట పొలాలను ఆయన పరిశీలించారు. వరద వస్తున్నా డ్యామ్ లలోని నీరు ఎందుకు వదలలేదని ఒక్కసారిగా లక్షలాది క్యూసెక్కుల వదలడంలో అంతర్యమేంటని ప్రశ్నించారు. అమరావతిని ముంచటానికి ఉద్దేశ్యపూర్వక కుట్రకాదా అని ప్రశ్నించారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతుకు ప్రభుత్వం నష్ట పరిహారం అందించాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి

ఈనెల 19 నాటికి మధ్య బంగాళాఖాతంలో మరో అల్పపీడనం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.