గ్రూప్-1 మెయిన్స్ వాయిదా వేయాలని ఇటీవల మెయిన్స్‌కు అర్హత పొందిన అభ్యర్థులు ఏపీపీఎస్సీ కార్యదర్శిని కోరారు. పరీక్షను 3 నెలలు వాయిదా వేయాలని కోరడానికి.. ఏపీపీఎస్సీ కార్యదర్శిని కలిశారు. డిసెంబర్ 14 నుంచి మెయిన్స్ నిర్వహిస్తే... కేవలం 45 రోజుల్లో పరీక్షకు సిద్ధం కాలేమని అభ్యర్థులు తెలిపారు.
మెయిన్స్ రోజే కేంద్ర, రాష్ట్ర ఉద్యోగ నియామక పరీక్షలు ఉన్నాయని... చాలామంది దరఖాస్తు చేసినందున..అభ్యర్థులు ఇబ్బందులు పడకుండా మెయిన్స్ వాయిదా వేయాలని ఏపీపీఎస్సీ కార్యదర్శికి విజ్ఞప్తి చేశారు.
ఇదీ చదవండి: రైతులను ఆదుకోవాలని తెదేపా నిరసన ర్యాలీ