ETV Bharat / city

జిల్లాల్లో ఘనంగా వాలంటీర్లకు సన్మానం - ఈరోజు వాలంటీర్లకు సన్మానం వార్తలు

ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు మంత్రులు అవార్డులు అందజేశారు. ఉత్తమ సేవలందించిన వాలంటీర్లకు శాలువాలు కప్పి, మెడల్​తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. మరింత ఉత్సాహంగా పని చేసి ప్రభుత్వానికి మంచి పేరు తీసుకురావాలని నేతలు ఆకాంక్షించారు.

grand Honor to volunteers
జిల్లాల్లో ఘనంగా వాలంటీర్ల సన్మానం
author img

By

Published : Apr 12, 2021, 5:31 PM IST

విజయనగరంలోని ఆనంద గజపతి ఆడిటోరియంలో పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ చేతుల మీదుగా.. ఉత్తమ సేవలు అందించిన గ్రామ, వార్డు వాలంటీర్లకు అవార్డులను అందజేశారు. జ్యోతి ప్రజ్వాలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించిన మంత్రి.. శాలువాలు కప్పి, మెడల్​తో పాటు ప్రశంసా పత్రాన్ని అందజేశారు. దేశంలో ఎక్కడా లేనివిధంగా వాలంటీర్లు వ్యవస్థకి ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అంకురార్పణ చేశారన్నారు. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చినప్పుడు ఎన్నో ఆరోపణలు చేసిన వాళ్ళే.. ఇప్పుడు శభాష్ అంటున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి, నెల్లిమర్ల ఎమ్మెల్యే బడుకొండ అప్పలనాయుడు, జిల్లా వైకాపా సమన్వయకర్త మజ్జి శ్రీనివాసరావు, కలెక్టర్ ఎం.హరిజవహర్ లాల్, సంయుక్త కలెక్టర్ మహేష్ కుమార్, ఎస్పీ రాజకుమారి, పలువురు అధికారులు పాల్గొన్నారు.

విశాఖలో వాలంటీర్లకు వందనం..

విశాఖపట్నంలో వాలంటీర్లకు వందనం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. జిల్లా మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో.. భీమిలి నియోజకవర్గంలోని గ్రామ వార్డు వాలంటీర్లకు సన్మానం చేశారు. ఆనందపురం మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా.. సేవా మిత్ర, సేవ రత్న, సేవా వజ్ర వంటి మూడు విభాగాల్లో గ్రామ, వార్డు వాలంటీర్లకు మంత్రి అవార్డులు ప్రధానం చేశారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల అమలులో వాలంటీర్ల పాత్ర ఎనలేనిదని కొనియాడారు. వారి సేవలకు ఇచ్చే చిరు కానుకే ఈ అవార్డుల ప్రదానోత్సవం అని తెలిపారు.

కర్నూలులో వాలంటీర్ల ఉగాది పురస్కారాలు..

వాలంటీర్ల సేవలు మరువలేనివని.. ప్రజలకు, ప్రభుత్వానికి వారధిగా నిలుస్తున్నారని.. కర్నూలు ఎంపీ డాక్టర్ సంజీవ్ కుమార్ తెలిపారు. జిల్లా కలెక్టరేట్​లోని సునయన ఆడిటోరియంలో జరిగిన వాలంటీర్ల సేవలకు ఉగాది పురస్కార ప్రదానోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురస్కారాలతో వాలంటీర్లను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా డిప్యూటీ మేయర్ ఎస్.రేణుక, మున్సిపల్ కమిషనర్ డీకే బాలాజీ పాల్గొన్నారు.

అనంతలో ఘనంగా వాలెంటీర్ల సత్కార సభ..

గ్రామ, వార్డు వాలెంటీర్ల సేవలు అద్భుతమని రాష్ట్ర మంత్రి శంకరనారాయణ చెప్పారు. అనంతపురం అసెంబ్లీ నియోజకవర్గం వాలంటీర్ల సత్కార సభ ఘనంగా నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 16 వేల 750 మంది వాలంటీర్లు సేవావజ్ర, సేవారత్న, సేవామిత్ర పురస్కారాలకు ఎంపికయ్యారని మంత్రి తెలిపారు. కేవలం గౌరవ వేతనంతో నిజాయితీగా పనిచేస్తున్న వాలంటీర్లకు ఈ పురస్కారాలు చాలా తక్కువేనని, ప్రతి వాలంటీర్ వజ్రామేనని మంత్రి కొనియాడారు. వాలంటీర్ల సేవలు వెలకట్టలేనివని ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పేర్కొన్నారు. వాలంటీర్ల వ్యవస్థను తీసుకొచ్చిన సీఎం జగన్ మోహన్ రెడ్డిని పొరుగు రాష్ట్రాల ప్రభుత్వాలు ఆదర్శంగా తీసుకుంటున్నాయన్నారు.

ఇవీ చూడండి...

మహారాష్ట్ర తొమ్మిదో తరగతి తెలుగు పాఠ్యపుస్తకంలో.. తెలుగోడి పాట

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.