ETV Bharat / city

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు నిబంధనల చిక్కులు

author img

By

Published : Aug 21, 2020, 5:18 PM IST

ఉన్నతోదోగ్యం వచ్చిన గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రభుత్వం విధించిన నిబంధనలు కష్టాలు తెస్తున్నాయి. కష్టపడి చదివి పెద్ద హోదా కల్గిన ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకున్నా కొలువులో చేరేందుకు అడ్డంకులు తప్పడంలేదు. ఉద్యోగానికి రాజీనామా చేస్తే ఇప్పటి వరకు తీసుకున్న వేతనాన్ని తప్పనిసరిగా తిరిగి జమ చేయాల్సిందేనన్న నిబంధనలను కచ్చితంగా అమలు చేస్తుండడంతో అభ్యర్థులు తీవ్రఇబ్బందులు పడుతున్నారు.

గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి నిబంధనల చిక్కులు

గ్రామ, వార్డు సచివాలయాల వ్యవస్థను తీసుకువచ్చిన ప్రభుత్వం గతేడాది పెద్ద ఎత్తున నియామకాలు చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగంలో చేరిన అభ్యర్థులు మధ్యలోనే ఉద్యోగం విడిచి వెళ్లకుండా కూడా నిబంధనలు పెట్టింది. ఈ నిబంధనలు ఉన్నతోద్యోగం వచ్చిన అభ్యర్థులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. సిబ్బంది ఎవరైనా రాజీనామా చేసి వెళ్లాలనుకుంటే అప్పటివరకు తీసుకున్న వేతనాన్ని ప్రభుత్వానికి తిరిగి చెల్లించాలని నిబంధన విధించారు.

వేతనం తిరిగి చెల్లించాల్సిందే

ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా గతంలో ఏపీపీఎస్సీ, స్టాఫ్ సెలక్షన్ కమిషన్, రైల్వే సహా ఇతర కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉద్యోగ నియామక పరీక్షలకు హాజరైన అభ్యర్థులు ఎక్కువహోదా కలిగిన కొలువులకు ఇటీవలే ఎంపికయ్యారు. ఉద్యోగంలో చేరాలని కాల్ లెటర్లు రావడంతో వారంతా ఉన్నతోద్యోగంలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. నిబంధనల ప్రకారం ఇప్పటివరకు తీసుకున్న వేతనాన్ని తిరిగి చెల్లిస్తేనే రిలీవ్ చేస్తామని జిల్లా స్థాయి అధికారులు ఖరాకండిగా చెబుతున్నారు.

ఉన్నత ఉద్యోగాల్లో చేరేందుకు అడ్డంకులు

పొట్టి శ్రీరాములు జిల్లా అల్లూరు మండలం పురిణి గ్రామ సచివాలయంలో పనిచేస్తోన్న ఓ ఉద్యోగి రైల్వేలో లోకో పైలట్ ఉద్యోగానికి ఎంపికయ్యారు. విజయనగరం జిల్లాలోని గజపతినగరం, జామి, కొత్తవలస మండలాల్లోని పలువురు గ్రామ సచివాలయ ఉద్యోగులదీ ఇదే పరిస్ధితి. వేతనాన్ని తిరిగి చెల్లిస్తేనే రిలీవ్ చేస్తామని జిల్లా అధికారులు తేల్చి చెప్పడంతో అభ్యర్థులు ఆందోళన చెందుతున్నారు. ఉద్యోగంలో చేరినప్పటి నుంచి ఎంతో వ్యయ ప్రయాసల కోర్చి గ్రామ సచివాలయ ఉద్యోగ విధులు నిర్వహించామని.. కొవిడ్ సమయంలోనూ నిరంతరం అందుబాటులో ఉండి సేవలందించిన తమ పట్ల అధికారులు అనుసరిస్తున్న వైఖరిపై ఉద్యోగార్థులు మనోవేదన చెందుతున్నారు. ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్నత ఉద్యోగాలకు వేతనాలు చెల్లించాల్సిన అవసరం లేదని.. ప్రైవేటు ఉద్యోగాల్లో చేరితేనే వేతనాలు తిరిగి తీసుకుంటామని గతంలో ఉన్నతాధికారులు స్పష్టం చేశారని కొందరు అభ్యర్థులు అంటున్నారు. జిల్లాల్లో మాత్రం ప్రభుత్వ ఉన్నత కొలువు వచ్చినా వేతనాలు తిరిగి చెల్లించాలని తేల్చి చెప్పడంతో అభ్యర్థులు ఏం చేయాలో పాలుపోని పరిస్థితిలో ఉన్నారు. తమ సమస్యలపై సచివాలయం ఉన్నతాధికారులు, ముఖ్యమంత్రి కార్యాలయానికి వినతులు పంపుతున్నారు. తమకు మినహాయింపు ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

డిపార్టుమెంట్ పరీక్షలు వేయాలని వినతి

గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నియామక సమయంలో పెట్టిన మరో నిబంధన కూడా ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. గతేడాది అక్టోబర్ లో విధుల్లో చేరిన వారికి 2021 అక్టోబర్ కు రెండు సంవత్సరాలు పూర్తవనున్నాయి. ఆలోపే డిపార్టు మెంట్ పరీక్ష తప్పక పాస్ కావాల్సిఉంది. ప్రొబిషన్ కాలంలోనే డిపార్టు మెంట్ టెస్టు తప్పక పాస్ కావాలని నిబంధన విధించారు.. లేనిపక్షంలో ఉద్యోగాలు రెగ్యులేషన్ క్లిష్టమవుతుందని స్పష్టం చేశారు. గతేడాది నవంబర్ లో ఓ అవకాశం పోయింది. ఈ నెల 25 నుంచి 28 వరకు డిపార్టుమెంట్ పరీక్షల నిర్వహణకు ఏపీపీఎస్సీ హాల్ టికెట్లు కూడా జారీ చేస్తోంది. దీంతో సచివాలయ ఉద్యోగుల్లో ఆందోళనకు కారణమవుతోంది. కొవిడ్ నివారణలో ఎంతో కీలకంగా వ్యవహరిస్తున్నామని పరీక్షలను కొంత కాలం వాయిదా వేయాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘం ద్వారా ఉద్యోగులు ప్రభుత్వానికి లేఖ రాశారు. ఒకవేళ పరీక్షలు నిర్వహిస్తే పాస్ కాని పరిస్థితుల్లో ఉద్యోగాలు కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళనచెందుతున్నారు.

ఇదీ చదవండి : రాష్ట్ర ప్రజలకు సీఎం జగన్ వినాయకచవితి శుభాకాంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.