రాష్ట్రంలోని క్రైస్తవులకు గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు చెప్పారు. ఏసుక్రీస్తు శిలువ వేయబడిన సంఘటనకు గుర్తుగా.. గుడ్ ఫ్రైడే జరుపుకుంటారన్నారు. ఏసు గొప్ప ప్రేమను చూపించాడని, నమ్మిన వారి శ్రేయస్సు కోసం ప్రాణ త్యాగం చేశారని పేర్కొన్నారు.
క్రీస్తు త్యాగాలను కీర్తిస్తూ ఈ రోజు ప్రార్థనలతో సాగే కార్యక్రమాలు ప్రేమాభిమానాలను ప్రతిబింబిస్తాయన్నారు. కరోనా మార్గదర్శకాల మేరకు ఎల్లప్పుడూ ముసుగు ధరించి, సామాజిక దూరాన్ని పాటించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కొవిడ్ వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితం, అర్హత ఉన్న వారందరూ ముందుకు వచ్చి టీకాలు వేయించుకోవాలని కోరారు.
ఇదీ చదవండి: గుడ్ ప్రైడే : త్యాగమూర్తి ఏసు దారి మానవాళికి ఆదర్శమార్గం