ETV Bharat / city

స్థానిక పోరుకు సన్నద్ధం... ఏర్పాట్లలో అధికారులు నిమగ్నం - స్థానిక పోరుకు సన్నద్ధం

పురపాలక, పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మున్సిపల్‌శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. డిసెంబరు మార్చి మధ్య ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉందని చెబుతున్నారు. ఈ రెండు ఎన్నికల్నీ ఒకేసారి నిర్వహించాలా...? లేక వేర్వేరుగా అన్న అంశంపై ఇంకా స్పష్టత రాలేదు.

స్థానిక పోరుకు సన్నద్ధం
author img

By

Published : Sep 29, 2019, 6:54 AM IST

రాష్ట్రంలోని 12,918 పంచాయతీల్లో సర్పంచుల పదవీకాలం గత ఏడాది ఆగస్టు ఒకటితో ముగిసింది. అప్పటి నుంచి పంచాయతీల్లో ప్రత్యేక అధికారుల పాలన నడుస్తోంది. సకాలంలో ఎన్నికలు నిర్వహించకపోవడాన్ని సవాల్‌ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా ప్రభుత్వ వైఖరి తెలియజేయాలని నోటీసులు జారీ చేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 2013లో నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో 59.85 శాతం రిజర్వేషన్ల అమలుపై... సుప్రీంకోర్టు తదుపరి ఎన్నికల్లో 50 శాతానికి పరిమితం చేయాలని ఆదేశించింది. రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ ప్రభుత్వం ఆర్డినెన్స్‌ జారీ చేస్తే ఎన్నికల నిర్వహణకు వీలుగా ఇప్పటికే పంచాయతీల వారీగా ఓటర్ల జాబితాలు, జిల్లాల్లో బ్యాలెట్‌ బాక్సులు సిద్ధం చేశామని అధికారులు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెప్పారు.

సకాలంలో ఎన్నికలు నిర్వహించని కారణంగా స్థానిక సంస్థలకు కేంద్ర ఆర్థిక సంఘం నిధులు నిలిపివేసింది. పంచాయతీలు రూ.2వేల కోట్లు, పురపాలక, నగరపాలక సంస్థలు మరో 3,500 కోట్లు నష్టపోయాయి. సాధారణ నిధులు (జనరల్‌ ఫండ్‌) అంతంత మాత్రంగా ఉన్న పరిస్థితుల్లో ఆర్థికసంఘం నిధులు నిలిచిపోవడంతో ఎలాంటి పనులు నిర్వహించలేక పోతున్నామని అధికారులు చెప్పారు. పట్టణ స్థానిక సంస్థల్లో 2011 జనాభా లెక్కల ప్రకారం వార్డుల వారీగా ఓటర్ల జాబితాల తయారీకి పురపాలకశాఖ చర్యలు తీసుకుంటోంది. తాజాగా 89 పురపాలక, నగరపాలక సంస్థల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసేందుకు ఆదేశాలు వెలువడ్డాయి. ఓటర్ల జాబితాల నుంచి ఎస్సీ ఎస్టీ, బీసీల వివరాలు కూడా సేకరించనున్నారు.

ఇదీ చదవండీ... శ్రీవారి బ్రహ్మోత్సవాలు... రద్దీకి అనుగుణంగా ఏర్పాట్లు

Intro:ap_knl_31_28_karent_dharna_ab_ap10130 కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు విద్యుత్తు ఉప కార్యాలయం ముందు విద్యుత్తు సమస్య పై సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఉప విభాగంలో గృహ వినియోగదారులు,రైతులు విద్యుత్తు సరఫరా లో అంతరాయం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. ప్రభుత్వం 24గంటలు విద్యుత్తు సరఫరా అంటున్నా క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు. విద్యుత్తు సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సోమిరెడ్డి, రిపోర్టర్, ఎమ్మిగనూరు కర్నూలు జిల్లా,8008573794.Body:విద్యుత్తు సమస్య పైConclusion:ధర్నా
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.