ప్రభుత్వం నిర్వహిస్తున్న మద్యం దుకాణాల్లో ఆర్థిక అక్రమాలు జరుగుతుండటంపై దిద్దుబాటు చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వం మద్యం దుకాణాల్లో ప్రక్షాళన చర్యలు మొదలు పెట్టింది. విశాఖలో వెలుగు చూసిన అక్రమాలతో అప్రమత్తం అయిన ఎక్సైజ్ శాఖ... ప్రభుత్వానికి కీలక ప్రతిపాదనలు చేసింది. దుకాణాల్లోని సిబ్బందిని పూర్తి స్థాయిలో బదిలీ చేయాలని ప్రతిపాదించింది.
మద్యం షాపుల్లోని సిబ్బందిపై నిరంతర నిఘా పెట్టేలా చర్యలు చేపట్టనున్నట్టు వెల్లడించింది. దుకాణాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ కోసం జిల్లా స్థాయిలో కంట్రోల్ రూముల ఏర్పాటుకు సూచనలు ఇచ్చింది. ప్రతి సేల్స్ మెన్కు ఇద్దరేసి చొప్పున పూచీకత్తులు తీసుకోవాలని ప్రతిపాదన చేసింది. అమ్మకాలపై ప్రత్యేక ఆడిటర్లను నియమించుకుని నెలవారీ ఆడిట్ చేయించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపింది.
మద్యం బాటిళ్లపై లేబుళ్ల స్కానింగ్ చేయకపోవడం వల్ల దుకాణాల్లో భారీ అవకతవకలు జరుగుతోన్నట్టు ఏపీ ఎక్సైజ్ శాఖ గుర్తించింది. స్కానింగ్ తప్పకుండా జరిగేలా డిస్టలరీ ఆఫీసర్లకు అధికారాలు అప్పగించాలని నిర్ణయం తీసుకున్నారు.
ఇదీ చదవండి:
Chandrababu letter to CM: 'ధాన్యం బకాయిలు వెంటనే చెల్లించండి'