ETV Bharat / city

Office timings: ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు - AP News

ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉద్యోగుల పనివేళలు మార్పు చేస్తూ.. సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.

govt employees duty timings changed
ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు
author img

By

Published : Jun 20, 2021, 10:27 PM IST

Updated : Jun 21, 2021, 8:09 AM IST

రాష్ట్రంలో కర్ఫ్యూ సడలింపులతో నేటి నుంచి ప్రభుత్వ ఉద్యోగుల పనివేళల్లో మార్పులు చేస్తూ.. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. తూర్పుగోదావరి జిల్లా మినహా మిగిలిన ప్రాంతాల్లో ఉద్యోగుల పనివేళలు మార్పు చేస్తూ.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్ ఉత్తర్వులు ఇచ్చారు.

తూర్పుగోదావరి జిల్లాలో ఉదయం 8.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటవరకు పనివేళలుగా నిర్ణయించారు. మిగిలిన ప్రాంతాలన్నింటిలోనూ కార్యకలాపాలు కొవిడ్ ముందు ఉన్న సమయాల తరహాలోనే కొనసాగనున్నాయి. ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగులకు పనివేళలుగా నిర్ణయించారు. ఈనెల 30వ తేదీ వరకు ఈ పనివేళలు వర్తిస్తాయని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల్లో తెలిపింది. అన్ని విభాగాధిపతులు, కలెక్టర్లు ఆదేశాలు అమలు చేయాలని సీఎస్ ఆదిత్యనాథ్ దాస్ ఆదేశించారు.

ఇదీ చదవండి:

Vaccination record: కొవిడ్ వ్యాక్సినేషన్‌లో రాష్ట్రం సరికొత్త రికార్డు

Last Updated : Jun 21, 2021, 8:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.