ఈ నెల 17న గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘం భేటీ కానుంది. ఈ సమావేశంలో ప్రధానంగా గెజిట్ అమలుపై జీఆర్‌ఎంబీ ఉపసంఘం చర్చించనుంది. ఈ భేటీకి జీఆర్ఎంబీ సభ్యులు, తెలుగు రాష్ట్రాల అధికారులు హాజరు కానున్నారు.
ఉపసంఘం ఏర్పాటు..
కేంద్రం జారీ చేసిన గెజిట్ నోటిఫికేషన్ అమలు ప్రక్రియ కోసం ఇదివరకే గోదావరి నదీ యాజమాన్య బోర్డు ఉపసంఘాన్ని ఏర్పాటు చేసింది. ఇటీవల జరిగిన జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ(KRMB) సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు గతంలో ఏర్పాటు చేసిన సమన్వయ కమిటీ స్థానంలో ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. బోర్డు మీటింగ్ మినిట్స్‌తో పాటు ఉపసంఘాన్ని ప్రకటించారు. గోదావరి నదీ యాజమాన్య బోర్డు సభ్య కార్యదర్శి ఉపసంఘానికి కన్వీనర్‌గా వ్యవహరిస్తారు.
ఇదీ చదవండి: