గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం (GRMB meeting) కొనసాగుతోంది. హైదరాబాద్ జలసౌధలో జీఆర్ఎంబీ ఛైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన భేటీ జరుగుతోంది. తెలుగు రాష్ట్రాల అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. గెజిట్ నోటిఫికేషన్ (Gazette notification) అమలుపై చర్చిస్తున్నారు. పెద్దవాగు ప్రాజెక్టును బోర్డు అధీనంలోకి తీసుకునే అంశంపై ప్రధానంగా దృష్టిసారించనున్నారు. ఈనెల 14 నుంచి కేంద్ర జలశక్తి శాఖ జారీచేసిన గెజిట్ అమలులోకి రానుంది. బోర్డుల పరిధిలోకి రానున్న ప్రాజెక్టులను ఇప్పటికే అధికారులు గుర్తించారు. దీనిపై రాష్ట్రం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇరు రాష్ట్రాల పరిధిలోకి రాని ప్రాజెక్టులను కేంద్రం పరిధిలోకి తీసుకోవద్దని స్పష్టం చేస్తోంది.
GRMB meeting: గోదావరి నదీ యాజమాన్య బోర్డు సమావేశం - ఏపీ తాజా వార్తలు
12:36 October 11
GRMB meeting: