ETV Bharat / city

శాసన రాజధానిగా అమరావతి.. కర్నూలులో హైకోర్టు - జీఎన్ రావు కమిటీ నివేదక వార్తలు

రాష్ట్ర అభివృద్ధి ఏ విధంగా ఉండాలి.. రాజధాని ఎలా ఉండాలనే అంశాలపై తమ కమిటీ అధ్యయనం చేసిందని విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, కమిటీ కన్వీనర్‌ జీఎన్‌ రావు తెలిపారు. రాజధాని సహా ఏపీ సమగ్రాభివృద్ధిపై సీఎం జగన్‌కు తుది నివేదిక సమర్పించిన అనంతరం కమిటీ సభ్యులు సచివాలయంలో మీడియా సమావేశం నిర్వహించారు.

GN RAO COMMITE
GN RAO COMMITE
author img

By

Published : Dec 20, 2019, 6:41 PM IST

Updated : Dec 20, 2019, 7:40 PM IST

రాష్ట్రాభివృద్ధితో పాటు రాజధాని అంశంపై ప్రభుత్వం నియమించిన జీఎన్​ రావు కమిటీ.. నివేదికను సీఎం జగన్​కు అందజేసింది. అనంతరం మీడియా సమావేశం నిర్వహించిన సభ్యులు.. నివేదికకు సంబంధించిన వివరాలు వెల్లడించారు.

విశాఖలో సచివాలయం ఏర్పాటుకు సూచన:జీఎన్ రావు

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పర్యటించామని నిపుణుల కమిటీ తెలిపింది. ప్రజాభిప్రాయ సేకరణలో భాగంగా సుమారు 38 వేలకుపైగా సూచనలు వచ్చాయని తెలిపారు. రెండు అంశాల ఆధారంగా నివేదిక రూపొందించామని కమిటీ తెలిపింది. సహజ వనరుల, పర్యావరణానికి అనుగుణంగా సూచనలు ఇచ్చామని స్పష్టం చేసింది. సహజ వనరులు అన్ని ప్రాంతాలకు సమానంగా వర్తించేలా అధ్యయనం చేశామని వివరించారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తే ఆయా ప్రాంతాల్లో ఎలా మౌలిక వనరుల అభివృద్ధి అవుతాయనే అనే కోణంలో అధ్యయనం సాగిందని తెలిపారు.

నాలుగు ప్రాంతాలు అభివృద్ధి చేయాలని సూచించాం: జీఎన్ రావు

నిపుణుల కమిటీ చేసిన సూచనలు

  • నాలుగు ప్రాంతీయ అభివృద్ధి మండళ్లకు సిఫార్సు
  • ఉత్తరాంధ్ర, మధ్య కోస్తా, దక్షిణ కోస్తా, రాయలసీమగా విభజన
  • శాసన రాజధానిగా అమరావతి
  • కర్నూలులో హైకోర్టు ఏర్పాటుతో పాటు అమరావతి, విశాఖలో హైకోర్టు బెంచ్ ఏర్పాటు
  • విశాఖలో సీఎం క్యాంపు కార్యాలయం, సచివాలయం

మరింత అభివృద్ధి చేయవచ్చు..

భౌగోళిక స్థితిగతుల ఆధారంగా సిఫార్సులు: జీఎన్ రావు

తుళ్లూరు ప్రాంతాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే అభివృద్ధి చేసిందని కమిటీ సభ్యులు తెలిపారు. ఈ ప్రాంతాన్ని వివిధ శాఖలకు వినియోగించుకోవచ్చని అన్నారు. అమరావతిలో రైతులకు అందాల్సిన ప్లాట్లును అన్ని విధాలుగా అభివృద్ధి చేసి ఇవ్వాలని సూచించామన్నారు.

రాజధాని ఏది అన్న ప్రశ్నపై..!

రాష్ట్ర రాజధాని ఏదన్న ప్రశ్నకు నిపుణుల కమిటీ స్పష్టమైన ప్రకటన చేయలేదు. అది తమ పని కాదని కమిటీ తెలిపింది. కేవలం ప్రభుత్వానికి సూచనలు మాత్రమే ఇచ్చామని...తుది నిర్ణయం సర్కారు తీసుకుంటుందని స్పష్టం చేసింది.

ఇదీ చదవండి:

ముఖ్యమంత్రితో నిపుణుల కమిటీ భేటీ.. నివేదిక అందజేత!

Last Updated : Dec 20, 2019, 7:40 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.