విమానం దిగగానే ఎయిర్‌పోర్టు వద్ద క్యాబ్ కోసం వెతుక్కుంటాం. అంతసేపు గాల్లో ఎగురుతూ వచ్చిన అనుభూతి.. ఆ కార్లలో తిరిగిన కాసేపటికి మాయమైపోతుంది. చుట్టుపక్కల పరిసరాలను ఆస్వాదించాలన్న కోరిక పోతుంది. అందుకే తెలంగాణలోని జీఎంఆర్ హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం ఓ సరికొత్త ప్రయోగాన్ని అందుబాటులోకి తెచ్చింది. విమానాశ్రయంలోకి అడుగుపెట్టగానే మనకోసం లగ్జరీ కార్లు ఎదురు చూస్తుంటాయి. దేశంలోనే మొట్టమొదటిసారిగా హైదరాబాద్‌లో ఇలాంటి సదుపాయం జీఎంఆర్ అందిస్తోంది.
ఇష్టమైన కార్లలో..
ఆ కార్లలో ప్రయాణిస్తూ మహానగర అందాలను వీక్షించవచ్చు. లగ్జరీ కార్లను అద్దెకు తీసుకొని సెల్ఫ్ డ్రైవింగ్‌కు అవకాశాన్నిసైతం జీఎంఆర్ కల్పించింది. టొయోటో ఫార్చూనర్, బీఎండబ్ల్యూ 3 జీటీ, బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడస్ బెంజ్ ఈ 250, మారుతి సుజూకీ సియాజ్, లెక్సెస్ ఈఎస్ 300 హెచ్, ఆడి ఏ3 క్యాబ్రియోలెట్ తదితర విలాసవంతమైన కార్లలో కాసేపు ప్రయాణించే అవకాశాన్ని జీఎంఆర్ అందిస్తోంది. విమానాశ్రయానికి చేరుకునేముందు ముందస్తుగా బుక్ చేసుకుంటే ఫ్లైట్ దిగే లోపు అత్యాధునిక హంగులతో లగ్జరీ కారు మీ ముందుంటుంది. మరి ఇంకెందుకు ఆలస్యం.. విలాసవంతమైన ప్రయాణానికి సిద్ధం కండి.
ఇవీచదవండి.