ETV Bharat / city

బల్దియా పోలింగ్​కు సన్నద్ధం.. ఎన్నికల సిబ్బందికి కరోనా కిట్లు

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలకు అధికారులు రంగం సిద్ధం చేశారు. 150 డివిజన్లకు సంబంధించి 30 డీఆర్సీ కేంద్రాల్లో పోలింగ్ సిబ్బందికి అధికారులు సామగ్రి పంపిణీ చేశారు. కరోనా కారణంగా సిబ్బంది ఫేస్​మాస్కులు, శానిటైజర్​తో కూడిన కిట్లను అందించారు.

బల్దియా పోలింగ్​కు సన్నద్ధం.. ఎన్నికల సిబ్బందికి కరోనా కిట్లు
బల్దియా పోలింగ్​కు సన్నద్ధం.. ఎన్నికల సిబ్బందికి కరోనా కిట్లు
author img

By

Published : Nov 30, 2020, 8:10 PM IST

బల్దియా పోలింగ్​కు సన్నద్ధం.. ఎన్నికల సిబ్బందికి కరోనా కిట్లు

గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికలకు సంబంధించి అధికారులు పూర్తి స్థాయిలో సిద్ధమయ్యారు. డివిజన్ల వారీగా పోలింగ్ విధుల్లో పాల్గొనే సిబ్బందికి 30 డీఆర్సీ కేంద్రాల్లో సామగ్రిని అందజేశారు. ఎల్బీనగర్ జోన్‌లో 5, చార్మినార్‌ జోన్‌లో 6, ఖైరతాబాద్‌ జోన్‌లో 5, సికింద్రాబాద్‌ జోన్‌లో 5, శేరిలింగంపల్లి జోన్ లో 4, కూకట్ పల్లి జోన్‌లో 5 డీఆర్సీ కేంద్రాల ద్వారా పీఓలు, ఏపీఓలకు బ్యాలెట్ బాక్స్‌లు, ఇతర సామగ్రిని పంపిణీ చేశారు. డీఆర్సీ కేంద్రాల నుంచే బ్యాలెట్ బాక్సులు అందించడం సహా స్ట్రాంగ్ రూమ్‌ల, లెక్కింపు కేంద్రాల నిర్వహణ జరగనుంది.

అందుబాటులో అదనపు సిబ్బంది

కొవిడ్ జాగ్రత్తలు పాటిస్తూ ఎన్నికల ప్రక్రియను సజావుగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. కరోనా నేపథ్యంలో.. ఈసారి పోలింగ్ సిబ్బందికి మాస్క్​లు, శానిటైజర్లు, ఫేస్ షీల్డ్‌లతో కూడిన కిట్‌ను అందజేశారు. సిబ్బంది కొరత ఏర్పడితే అవసరమైన పక్షంలో అదనపు సిబ్బందిని కూడా అందుబాటులో ఉంచారు. డీఆర్సీ కేంద్రాల నుంచి నేరుగా సిబ్బంది.. వారికి కేటాయించిన పోలింగ్ కేంద్రాలకు పోలీస్ బందోబస్తు మధ్య వెళ్లారు.

డీఆర్సీ కేంద్రాల్లోనే బ్యాలెక్ బాక్సులు

పోలింగ్ ముగిసిన తర్వాత బ్యాలెట్ బాక్స్‌లను తిరిగి డీఆర్సీ కేంద్రాల్లోనే ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లకు తరలించనున్నారు. బల్దియా ఎన్నికలకు సంబంధించి 28 వేల 683 బ్యాలెట్ బాక్సులను వినియోగించనున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి అవసరమైన శిక్షణను అందించారు. దివ్యాంగులకు కోసం వీల్ చైర్లను సిద్ధం చేస్తున్నారు.

ఇదీ చూడండి:

తెదేపా రాష్ట్ర అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు బాధ్యతల స్వీకరణ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.