ETV Bharat / city

తెలంగాణ: కొనసాగుతున్న జీహెచ్‌ఎంసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు - జీహెచ్ఎంసీ పోల్స్ 2020

గ్రేటర్​ ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. డివిజన్ల వారీగా 30 కౌంటింగ్ హాళ్లలో లెక్కింపు జరుగుతోంది. మొదటగా పోస్టల్ బ్యాలెట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అనంతరం ప్రాథమిక లెక్కింపు చేపడతారు. కొవిడ్​ నిబంధనలు పాటిస్తూ మొత్తం 166 కౌంటింగ్ టేబుళ్లలో కౌంటింగ్ జరుగుతోంది. ఒక్కో కౌంటింగ్ హాల్‌లో 14 టేబుళ్లు ఏర్పాటు చేశారు.

ghmc
ghmc
author img

By

Published : Dec 4, 2020, 8:39 AM IST

మధ్యాహ్నం మూడు గంటల్లోపు ..

మొదటగా పోలైన అన్ని ఓట్ల లెక్కను సరిచూస్తారు. ఆ తర్వాత అభ్యర్థుల వారీగా ఓట్లను లెక్కిస్తారు. ప్రాథమిక లెక్కింపు మధ్యాహ్నం 12 గంటల్లోపు, మెజార్టీ వార్డుల పూర్తి లెక్కింపు ప్రక్రియ మధ్యాహ్నం మూడు గంటల్లోపు పూర్తయ్యేలా ఏర్పాట్లు చేశారు.

మొబైల్ ఫోన్లను నిషేధం..

రిటర్నింగ్ అధికారి, సహాయ రిటర్నింగ్ అధికారి లెక్కింపును పర్యవేక్షిస్తున్నారు. ప్రతి కౌంటింగ్ కేంద్రానికి ఒక్కో పరిశీలకుడిని నియమించారు. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఆర్డీఓ, డిప్యూటీ కలెక్టర్ల స్థాయి అధికారుల్ని పరిశీలకులుగా నియమించారు. కౌంటింగ్ హాళ్లలో మొబైల్ ఫోన్లను నిషేధించారు. పాసులు లేని వారికి కౌంటింగ్ కేంద్రాల్లోకి అనుమతించడం లేదు.

ఆర్వోదే నిర్ణయం..

ఎవరైనా అభ్యర్థులు రీకౌంటింగ్ కోరాలనుకుంటే ఫలితం ప్రకటించడాని కంటే ముందే రిటర్నింగ్ అధికారికి విజ్ఞప్తి చేయాల్సి ఉంటుంది. వారు పేర్కొన్న కారణాలను పరిగణలోకి తీసుకొని రీకౌంటింగ్ విషయమై ఆర్వో నిర్ణయం తీసుకుంటారు. ఒకవేళ ఇద్దరు అభ్యర్థులకు సమానంగా ఓట్లు వస్తే లాటరీ పద్ధతిన డ్రా తీసి ఫలితాన్ని ప్రకటిస్తారు. బ్యాలెట్ బాక్సులు తీసుకొచ్చే వారంతా పీపీఈ కిట్లను ధరించాలని పేర్కొంది. కౌంటింగ్ సిబ్బంది మాస్క్, ఫేస్ షీల్డ్ తప్పక ధరించాలని సూచించారు.

ఇవీ చూడండి:కాలువలోకి దూసుకెళ్లిన కారు.. ముగ్గురు మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.