గాంధీ ఆస్పత్రి పొరుగు సేవల సిబ్బంది ఉదయం నుంచి విధులు బహిష్కరించి ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగారు. వేతనాలు పెంచాలన్న డిమాండ్‌తో నిరవధిక సమ్మెకు వెళ్తున్నట్లు ప్రకటించారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు విధుల్లోకి వచ్చేది లేదని తేల్చిచెప్పారు. వీరి సమ్మెతో సౌకర్యాలు కల్పించే వారు లేక రోగులు ఇబ్బందులు పడ్డారు.
ఓపీ, ఇతర వార్డుల్లో సేవలకు తీవ్ర విఘాతం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వారి జీతాల పెంపు సమస్యకు పరిష్కారం లభించింది. చివరికి పొరుగు సేవల సిబ్బంది సమ్మె విరమించారు. షిప్టుల వారీగా నెలలో 15 రోజుల విధులకు అధికారులు అంగీకరించారు. కొవిడ్ విధుల్లో ఉన్నవారికి రోజుకు రూ.300 చొప్పున అదనపు భత్యం చెల్లించేందుకు అధికారులు ఒప్పుకొన్నారు.
ఇదీ చదవండి: