కరోనా నివారణ, సహాయ చర్యల కోసం సీఎం సహాయనిధికి విరాళాలు కొనసాగుతూనే ఉన్నాయి. కృష్ణా జిల్లా జగ్గయ్యపేట వైకాపా ఎమ్మెల్యే సామినేని ఉదయభాను, నియోజకవర్గ నాయకులు కోటీ 2 లక్షల 17వేల 879 రూపాయల విరాళం ప్రకటించారు. మంత్రి కొడాలి నాని, గుడివాడ వైకాపా నేతలు కలిసి 62 లక్షల 62 వేల 690 రూపాయలు విరాళమిచ్చారు. ఈ చెక్కును సీఎం వైఎస్ జగన్కు కుమార్తెతో కలిసి మంత్రి అందించారు.
విజయవాడ తూర్పు నియోజకవర్గ వైకాపా నాయకులు, ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫెడరేషన్, ఏపీ క్రెడాయ్ కలసి కోటి రూపాయల విరాళం అందించారు. దీనికి సంబంధించిన చెక్కును ముఖ్యమంత్రికి వైకాపా నేతలు దేవినేని అవినాష్, మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అందించారు.
ఇవీ చదవండి.. అంపన్ బాధిత రాష్ట్రాలు త్వరగా కోలుకోవాలి: చంద్రబాబు