ETV Bharat / city

లాఠీఛార్జ్​లు, ఆర్తనాదాలతో అట్టుడికిన ట్యాంక్​బండ్​ - TSRTC STRIKE LATEST NEWS

తెలంగాణలో సకల జనుల సామూహిక దీక్షా కార్యక్రమం అరెస్టులు, నిర్బంధాలు, ఎక్కడికక్కడే అడ్డుకోవటంతో మొదలై... లాఠీఛార్జ్​, బాష్పవాయువు ప్రయోగం, రాళ్లూచెప్పుల వర్షంతో తీవ్రరూపం దాల్చింది. ప్రభుత్వంపై వ్యతిరేక నినాదాలు, లాఠీ దెబ్బలకు హాహాకారాలు, నెత్తుటి చుక్కలతో ట్యాంక్​బండ్​ పరిసరాల్లో గందరగోళ వాతావరణం నెలకొంది.

లాఠీఛార్జ్​లు, ఆర్తనాదాలతో అట్టుడికిన ట్యాంక్​బండ్
author img

By

Published : Nov 9, 2019, 11:50 PM IST

లాఠీఛార్జ్​లు, ఆర్తనాదాలతో అట్టుడికిన ట్యాంక్​బండ్
తెలంగాణ ఆర్టీసీ ఐకాస తలపెట్టిన సకల జనుల సామూహిక దీక్ష కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ట్యాంక్​బండ్​ చేరుకునేందుకు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి కార్మికులు వేల సంఖ్యలో తరలివచ్చారు. పోలీసుల కంచెలను దాటుకుని ట్యాంక్‌బండ్​పైకి చేరుకున్న వందలాది మంది ఆర్టీసి కార్మికులు, విపక్ష పార్టీల కార్యకర్తలు, విద్యార్థి సంఘాల నేతల నినాదాలతో పరిసరాలు మారుమోగాయి.

ఎక్కడికక్కడే ముఖ్యనాయకుల గృహ నిర్బంధం...
ఉదయం నుంచే తెలంగాణ ఆర్టీసీ ఐకాస నేతలతో పాటు అఖిలపక్ష నేతలను పోలీసులు ఎక్కడికక్కడ అరెస్ట్‌లు చేశారు. అనేక మంది ముఖ్యనేతలను గృహ నిర్బంధం చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రులు డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు, పొంగులేటి సుధాకర్​రెడ్డిని గృహనిర్బంధం చేశారు. కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్, అంజన్‌కుమార్​ను తమ నివాసాల్లోనే నిర్బంధించారు.

నేతల అరెస్టుల పర్వం...
ట్యాంక్‌బండ్‌కు తరలివచ్చిన తెలంగాణ ఆర్టీసీ ఐకాస కన్వీనర్ ఆశ్వత్థామరెడ్డిని లిబర్టీ కూడలి వద్ద అరెస్టు చేయగా... ఎంపీ బండి సంజయ్‌, సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, మాజీ ఎంపీ వివేక్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట వరకూ అజ్ఞాతంలో ఉన్న తెజస అధ్యక్షుడు కోదండరామ్, చాడ వెంకట్‌రెడ్డితో పాటు భారీ సంఖ్యలో వచ్చిన తెజస శ్రేణులను ఇందిరాపార్క్​వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

ఒక్కసారిగా ఉద్రిక్తం...
మధ్యాహ్నం వరకు ప్రశాంతంగా ఉన్న ట్యాంక్‌బండ్ పరిసర ప్రాంతాలు ఒకటిన్నర ప్రాంతానికి ఆర్టీసీ కార్మికులు ఒక్కసారిగా ట్యాంక్‌ బండ్‌ మీదకు దూసుకువచ్చే ప్రయత్నం చేశారు. లిబర్టీ, లోయర్ ట్యాంక్‌బండ్, వెంకటస్వామి విగ్రహం వెనుక నుంచి భారీ ఎత్తున ఆందోళనకారులు రావటం వల్ల పోలీసులు... లాఠీలకు పనిచెప్పారు. కార్మికులు విడతల వారిగా ఒక్కోదారి నుంచి తరలిరావటం వల్ల నివారించలేక... గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళనకారులపై పోలీసులు టియర్ గ్యాస్ ప్రయోగించారు. రెచ్చిపోయిన ఆందోళనకారులు రాళ్లు, చెప్పులతో విరుచుకుపడ్డారు.

గాయాలతో కార్మికులు...
పోలీసుల లాఠీఛార్జ్​లో వందల మంది కార్మికులు గాయపడ్డారు. పలువురు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ స్థానిక ఆస్పత్రులకు తరలించారు. పోలీసులు విచక్షణారహితంగా కొట్టారని కార్మికులు ఆందోళన వ్యక్తం చేశారు. నాలుగింటి వరకు సాగిన గందరగోళ వాతావరణం... ఆ తర్వాత ముగిసిపోవటం వల్ల పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.

TG_Hyd_54_09_Akila_Paksham_Tankbund_Pkg_3182061 Reporter: Jyothi Kiran Script: Razaq Note: ఫీడ్ త్రీజీ ద్వారా వచ్చింది. ( ) ట్యాంక్‌బండ్‌పై ఆర్టీసీ ఐకాస చేపట్టిన సకల జనుల సామూహిక దీక్షకు అఖిలపక్ష నేతలు మద్దతు తెలపడంతో పలువురు విపక్షనేతలను పోలీసులు అరెస్టు చేశారు. సామూహిక దీక్షకు నగర పోలీసు కమిషనర్ అనుమతి నిరాకరించడంతోపాటు నిన్నసాయంత్రం నుంచే అన్ని విపక్ష పార్టీ నేతలను అదుపులోకి తీసుకున్నారు. ఉదయం భాజపా, కాంగ్రెస్, సీపీఎం సీపీఐ తెజసకు సంబంధించిన కీలక నేతలను గృహ నిర్బంధం చేశారు.....Loook వాయిస్ ఓవర్ : ట్యాంక్ బండ్‌పై ఆర్టీసీ ఐకాస మిలియన్ మార్చ్ నేపథ్యంలో అఖిల పక్ష పార్టీల నేతలను గృహ నిర్భందించడంతోపాటు మరికొంత మందిని అరెస్టు చేశారు. భాజపా రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్, ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రులు డీకే అరుణ, మోత్కుపల్లి నర్సింహులు మాజీ ఎమ్మెల్యేలు ఎమ్మోల్సీలు పొంగులేటి సుధాకర్ రెడ్డిలను గృహ నిర్బంధం చేశారు. కాంగ్రెస్ నేతలు మల్లు భట్టి విక్రమార్క, పొన్నం ప్రభాకర్ అంజన్‌కుమార్ తోపాటు పలువురు నేతలకు కూడా గృహ నిర్బంధించారు. సీపీఐ నేతలను కొంతమందిని అర్థరాత్రి అదుపులోకి తీసుకున్నారు. మిలియన్ మార్చ్‌ను విజయవంతం చేయాలనే సంకల్పంతో అఖిల పక్ష నేతలు పక్కా వ్యుహాలతో ముందుకు వెళ్లారు. ఎవరు ఎక్కడి నుంచి ట్యాంక్‌బండ్‌ వైపుకు రావాలనే దానిపై ముందుగానే నిర్ణయించుకున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు అజ్ఞాతంలో ఉన్న తెజస అధ్యక్షుడు కోదండరామ్, చాడ వెంకట్‌ రెడ్డి,తోపాటు పలువురు నేతలు ట్యాంక్ బండ్‌ వైపు దూసుకు వస్తుండడంతో పోలీసులు అడ్డకున్నారు. సీపీఎం పార్టీ కార్యాలయం నుంచి ఆ పార్ఠీ శ్రేణులు ఆర్టీసీ క్రాస్ రోడ్ అశోక్ నగర్ ఇందిరాపార్క్ లోయర్ ట్యాంక్ బండ్ మీదుగా ట్యాంక్‌బండ్‌ వైపుకు దూసుకువెళ్లారు. పోలీసులు నాలుగు చోట్ల బారికెడ్లు ముళ్ల కంచెలను ఏర్పాటు చేసినా వాటిని దాటుకుని ఆందోళనకారులు చొచ్చుకుని వెళ్లారు. లోయర్ ట్యాంక్ బండ్ వద్ద పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రంతోపాటు పలువురు మహిళా కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారు. కోదండరామ్ నేతృత్వంలో భారీగా ట్యాంక్ బండ్ వైపుకు తరలివస్తున్న తెజస శ్రేణులను ఇందిరాపార్కు వద్ద పోలీసులు అడ్డుకున్నారు. కోదండరామ్‌తోపాటు కార్యకర్తలను అరెస్టు చేసి ఠాణాకు తరలించారు.
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.