ETV Bharat / city

తెలంగాణలో మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికి ఐదు కిలోల బియ్యం - హైదరాబాద్​ లేటెస్ట్​ వార్తలు

కరోనా దృష్ట్యా రెండు నెలలపాటు ఉచిత రేషన్‌ అందించాలన్న కేంద్రం నిర్ణయానికి అనుగుణంగా తెలంగాణలోనూ పంపిణీ చేయనున్నారు. ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని మే, జూన్ నెలల్లో పంపిణీ చేయనున్నారు. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వ ఖజానాపై 90 కోట్ల రూపాయల అదనపు భారం పడనుంది.

telangana
telangana
author img

By

Published : May 8, 2021, 7:30 AM IST

కరోనా సెకండ్ వేవ్​ విజృంభణ కొనసాగుతోంది. కొవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగానే నమోదవుతోంది. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో రెండు నెలల పాటు ఆహారధాన్యాలను ఉచితంగా అందించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకం కింద మే, జూన్ నెలల్లో ఒక్కొక్కరికి ఐదు కిలోల చొప్పున ఆహారధాన్యాలను ఉచితంగా అందించనున్నారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోనూ రెండు నెలల పాటు ఐదు కేజీల చొప్పున ఉచితంగా బియ్యాన్ని ఇవ్వనున్నారు.

జాతీయ ఆహార భద్రతా చట్టం ప్రకారం తెలంగాణలోని 53 లక్షలా 57 వేల రేషన్ కార్డు దారులకు కేంద్ర ప్రభుత్వం ఉచితంగా బియ్యాన్ని అందిచనుంది. దీంతో కోటి 91 లక్షల మందికి లబ్ధి చేకూరుతుంది. అయితే జాతీయ ఆహార భద్రతా చట్టంతో పాటు రాష్ట్రంలో మరికొన్ని రేషన్ కార్డులు ఉన్నాయి. అలా పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించే రేషన్ కార్డుల సంఖ్య 33 లక్షల 85 వేలు. ఈ కార్డుల లబ్ధిదారుల సంఖ్య 87 లక్షల 54 వేల మంది. రెండు నెలల పాటు కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం రాష్ట్రంలోని 53 లక్షలా 57వేల రేషన్ కార్డులకు చెందిన కోటి 91 లక్షల మందికి మాత్రమే అందుతాయి.

మిగిలిన కార్డు దారులకు కూడా కేంద్రం తరహాలోనే రెండు నెలల పాటు ఐదు కిలోల చొప్పున ఉచిత బియ్యాన్ని అందించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీంతో రాష్ట్రంలోని మొత్తం 87 లక్షల 42 రేషన్ కార్డులకు చెందిన రెండు కోట్ల 78 లక్షల మందికి మే, జూన్ నెలల్లో ఐదు కిలోల చొప్పున బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో రాష్ట్ర ఖజానాపై 90కోట్ల రూపాయల మేర భారం పడుతుందని అంచనా వేశారు.

ఇదీ చదవండి:

రాష్ట్రంలో కరోనా కష్టాలు...పడకలు దొరక్క రోగుల ఇక్కట్లు !

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.