ETV Bharat / city

Etela Rajender: 'నిజాలు చెప్పినందుకే.. మంత్రి పదవి పోయింది'

తెలంగాణలో తెరాస నేతలు, మంత్రులపై మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ మరోసారి మండిపడ్డారు. హుజూరాబాద్​లో ఉపఎన్నిక లేకుంటే.. ఏ మంత్రైనా ఇక్కడికి వచ్చేవారా అంటూ ప్రశ్నించారు. కరీంనగర్ మంత్రి ఏనాడైనా జైలుకు వెళ్లి వచ్చారా? ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా? అంటూ మంత్రి గంగుల కమలాకర్‌ ను ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు.

etela rajender fires on trs government
భాజపా నేత ఈటల రాజేంద
author img

By

Published : Jul 10, 2021, 8:46 AM IST

తాను నోరు విప్పి నిజాలు చెప్పినందుకే మంత్రి పదవి పోయిందని తెలంగాణలో ఆరోగ్యశాఖ మాజీ మంత్రి, భాజపా నేత ఈటల రాజేందర్​ అన్నారు. మిగిలిన వారిలా మౌనంగా ఉంటే తాను పదవిలోనే కొనసాగేవాడినన్నారు. తనకు టికెట్ ఇచ్చినవాళ్లే ఓడించాలని చూశారని ఆరోపించారు. కరీంనగర్​ జిల్లా చెల్పూర్​లో తెరాస కార్యకర్తలు.. ఈటల సమక్షంలో భాజపాలో చేరారు.

ప్రత్యేక రాష్ట్రం కోసం చేసిన ఉద్యమంలో భాగంగా తనపై ఎన్నో కేసులు పెట్టారని, జైలుకు పంపారని ఈటల అన్నారు. కానీ తెరాసలో ఉన్న కొంతమంది నేతలు ఉద్యమంతో ఏమాత్రం సంబంధం లేదన్నారు. వారికి ఉద్యమం అంటే ఏంటో తెలియదని ఎద్దేవా చేశారు. కానీ అలాంటివారికే పదవులు వచ్చాయని విమర్శించారు.

ఏనాడైన ఉద్యమంలో పాల్గొన్నారా..

"ఆ మంత్రులు ఏనాడైనా జైలుకు వెళ్లి వచ్చారా? ఏనాడైనా ఉద్యమంలో పాల్గొన్నారా?" అంటూ గంగుల కమలాకర్‌, ఎర్రబెల్లి దయాకర్​రావును ఉద్దేశించి ప్రశ్నలు సంధించారు. హుజూరాబాద్ ప్రజలను మభ్యపెట్టేందుకు.. అవి చేస్తాం.. ఇవి చేస్తామంటూ హామీలు ఇస్తున్నారని విమర్శించారు. ఇందులో భాగంగానే కుల సంఘాల భవనాలు, పింఛన్లు ఇచ్చి ఆకట్టుకుంటున్నారని ఈటల రాజేందర్​ విమర్శించారు. ఓటు బ్యాంకు కోసం.. హామీల వర్షం కురిపిస్తున్నారని ఆరోపించారు.

ఏ మంత్రైనా అడుగుపెట్టేవారా..

తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయకుంటే హుజూరాబాద్​లో ఏ మంత్రయినా అడుగుపెట్టేవారా.. అంటూ ఈటల నిలదీశారు. ప్రజలను మభ్యపెట్టడానికే.. మంత్రులు పర్యటనలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు.

ఇదీ జరిగింది..

వైద్యారోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటలపై కొందరు రైతుల ఫిర్యాదులో ముఖ్యమంత్రి కేసీఆర్​ పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. అనంతరం మంత్రి పదవి నుంచి తొలగించారు. ఈ పరిణామాల నేపథ్యంలో ఈటల రాజేందర్​.. తెరాసకు గుడ్​బై చెప్పారు. తర్వాత తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేశారు. అనంతరం భాజపా గూటికి చేరారు. ఈటల రాజీనామా నేపథ్యంలో హుజూరాబాద్​లో ఉపఎన్నిక అనివార్యమయింది. ఈ స్థానాన్ని నిలబెట్టుకోవాలని తెరాస.. ఎలాగైనా కైవసం చేసుకోవాలని భాజపా వ్యూహాలు రచిస్తున్నాయి.

ఇదీ చూడండి:

Salaries: రాష్ట్రంలో పూర్తి స్థాయిలో అందని జీతాలు, పింఛన్లు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.