ETV Bharat / city

మూడు రాజధానులతో అన్ని ప్రాంతాలకూ నష్టమే: అఖిలప్రియ

అమరావతి నుంచి రాజధానిని తరలించాలనుకుంటే...విశాఖలో కాకుండా రాయలసీమకే తొలి ప్రాధాన్యం ఇవ్వాలని మాజీ మంత్రి భూమా అఖిలప్రియ డిమాండ్ చేశారు. చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా జగన్ వైఖరి ఉందని దుయ్యబట్టారు. మూడు రాజధానులతో అన్ని ప్రాంతాల ప్రజలకు నష్టమేనని వ్యాఖ్యానించారు.

former minister Bhuma Akhila Priya
former minister Bhuma Akhila Priya
author img

By

Published : Aug 2, 2020, 6:53 PM IST

జగన్ మొండిగా రాజధానిని మార్చాలనుకుంటే తొలి ప్రాధాన్యం రాయలసీమకే ఇవ్వాలని మాజీ మంత్రి అఖిలప్రియ డిమాండ్ చేశారు. వెనకబడిన రాయలసీమను కాదని విశాఖకు రాజధాని తరలించటం జగన్ సొంత అజెండా అని మండిపడ్డారు. విశాఖలో ప్రమాదం జరిగి చనిపోతే కోటి రూపాయలు ప్రకటించిన జగన్.. సీమ ప్రాంతంలో ఎవరు చనిపోయినా కనీసం పలకరించటం లేదని దుయ్యబట్టారు.

రాయలసీమ అంటే చిన్న చూపు చూడటం ప్రభుత్వానికి తగదని హెచ్చరించారు. రాష్ట్రంలో కరోనా కేసులు పెరిగి, ప్రజల ప్రాణాలు పోతుంటే... చంద్రబాబుపై కక్ష సాధింపే లక్ష్యంగా సీఎం జగన్ వైఖరి ఉందని అఖిలప్రియ విమర్శించారు. ప్రభుత్వ నిర్ణయాల వల్ల రాష్ట్ర భవిష్యత్​ 30 ఏళ్ళు వెనక్కి వెళ్ళిందని... ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ధ్వజమెత్తారు. ఎవ్వరూ కోరుకోని 3రాజధానుల నిర్ణయంతో అన్ని ప్రాంతాలకూ నష్టమేనని అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి

అయోధ్య... రామ జన్మభూమా? కొత్త ఆలయమా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.