తెలంగాణ రాష్ట్రం నిజామాబాద్ జిల్లా వర్ని మండలం జకోరా గ్రామ శివారు అటవీ ప్రాంతంలో జంతువులను వేటాడుతూ ఐదుగురు పట్టుబడ్డారు. జకోరా గ్రామంలోని అఫది ఫారం రైస్ మిల్లో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ హాబీబ్ఖాన్ పక్కా సమాచారంతో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో రెండు విదేశీ తుపాకులు, ఒక కారు, కుందేలు మాంసాన్ని అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తరుచుగా కుందేళ్లు, అడవి పందులను వేటాడుతున్న వీరు.. లైసెన్స్ తుపాకులతో హైదరాబాద్ నుంచి వచ్చినట్లు హాబీబ్ఖాన్ తెలిపారు. ఈ ఐదుగురిని అరెస్ట్ చేసిన అటవీశాఖ అధికారులు దర్యాప్తు చేపట్టారు.
ఇదీ చూడండి: