కొవిడ్(covid) కేసులు తగ్గుతున్నందున గురువారం నుంచి పర్యాటకశాఖ కార్యకలాపాలు రాష్ట్ర వ్యాప్తంగా పునఃప్రారంభమవుతాయని మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పేర్కొన్నారు. సందర్శనీయ ప్రాంతాల్లో పర్యాటకులను అనుమతిస్తామని వివరించారు. పర్యాటకశాఖకు చెందిన 48 బోట్లు తిప్పుతామన్నారు. తగిన జాగ్రత్తలు తీసుకొని నడిపేలా ప్రైవేట్ బోటు ఆపరేటర్లతో గురువారం సమావేశం ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి వెల్లడించారు. కరోనాతో పర్యాటకశాఖ కార్యకలాపాలకు ఇబ్బందులు ఎదురైనా కొవిడ్ రోగులకు ఆహారం అందించడం ద్వారా రూ.28 కోట్ల వ్యాపారం చేసి ఉద్యోగులకు జీతాలు అందించగలిగామని ముత్తంశెట్టి అన్నారు. పర్యాటకశాఖ(tourism department) ఆధ్వర్యంలోని 33 బార్లలో కొత్తగా విదేశీ మద్యం(foreign liquour) ప్రవేశ పెడుతున్నామని వెల్లడించారు.
విశాఖ(vishaka)లోని రుషికొండ రిసార్ట్స్(rushikonda resorts)ను రూ.164 కోట్లతో బ్లూ బే హోటల్‌గా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. విశాఖ తీరంలో ఇరుక్కుపోయిన బంగ్లాదేశ్ నౌకను రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో ఫ్లోటింగ్ రెస్టారెంట్‌గా తీర్చిదిద్దే పనులు వచ్చే నెలలో ప్రారంభమవుతాయని మంత్రి వివరించారు. విశాఖ, తిరుపతిలో ఒబేరాయ్ గ్రూపు ఏడు నక్షత్ర హోటళ్ల ఏర్పాటుకు ముందుకొచ్చినట్లు చెప్పారు. కడప జిల్లాలోని గండికోట(gandikota)ను పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని నిర్ణయించామన్నారు.
టోక్యో ఒలింపిక్స్(tokyo olympics)లో పాల్గొనే అంతర్జాతీయ క్రీడాకారులు పీవీ సింధు, రజిని, సాత్విక్ సాయిరాజులకు రూ.5 లక్షల చొప్పున నగదు ప్రోత్సాహకాన్ని అందించి సీఎం చేతుల మీదుగా త్వరలో సన్మానిస్తామని ముత్తంశెట్టి తెలిపారు. ఉత్తరాంధ్ర, కోస్తా, రాయలసీమకు ఒకటి చొప్పున అంతర్జాతీయ స్టేడియం ఏర్పాటు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందన్నారు. రాష్ట్రంలో గ్రామీణ క్రీడాకారులను ప్రోత్సహించేలా వచ్చే నెలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తామని వివరించారు.
విశాఖ నుంచి త్వరలో పరిపాలన
విశాఖ నుంచి త్వరలో పరిపాలన ప్రారంభమవుతుందని ఆశిస్తున్నామని మంత్రి ముత్తంశెట్టి పేర్కొన్నారు. తెలంగాణలోని హైదరాబాద్(hyderabad)తో సమానంగా విశాఖను అభివృద్ధి చేసే అవకాశం ఉందని తెలిపారు. అంతర్జాతీయంగా మహా నగరాన్ని అభివృద్ధి చేయాలని సీఎం భావిస్తున్నారని వివరించారు. అమరావతి, కర్నూలును కూడా అంతే స్థాయిలో ప్రభుత్వం తీర్చిదిద్ది ప్రాంతీయ అసమానతలను తొలగిస్తుందని చెప్పారు.
ఇదీ చదవండి: సీఎం జగన్‌పై కేసుల ఉపసంహరణ.. సుమోటోగా తీసుకుని హైకోర్టు విచారణ