ETV Bharat / city

IMD: వాతావరణ శాఖ చల్లని కబురు.. రాష్ట్రంలో ఇవాళ, రేపు స్వల్పంగా వర్షాలు! - ఈ ఏడాది వర్షపాతం అంచనాలు విడుదల

Today Weather Report: రాష్ట్రంలో ఇవాళ, రేపు స్వల్పంగా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ(ఐఎండీ) వెల్లడించింది. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఇవాళ తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. మరోవైపు నైరుతి రుతుపవనాల దీర్ఘకాలిక అంచనాలను ఐఎండీ విడుదల చేసింది

weather report of ap
రాష్ట్రంలో ఇవాళ, రేపు స్వల్పంగా వర్షాలు కురిసే అవకాశం
author img

By

Published : Apr 14, 2022, 6:16 PM IST

Updated : Apr 14, 2022, 7:51 PM IST

IMD on Rains Forecast: ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో ఇవాళ, రేపు స్వల్పంగా వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణశాఖ వెల్లడించింది. అలాగే ఉత్తర, దక్షిణ కోస్తాంధ్రలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని.. రాయలసీమలో ఒకట్రెండు చోట్ల ఇవాళ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది.

IMD Released Long Term Forecasts Southwest Monsoon: నైరుతి రుతుపవనాల దీర్ఘకాలిక అంచనాల(వర్షపాతం అంచనాలు)ను భారత వాతావరణశాఖ విడుదల చేసింది. ఈ ఏడాది సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని అంచనా వేసింది. పసిఫిక్ ప్రాంతంలో లానినో పరిస్థితులు కొనసాగుతున్నాయని.. జూన్-సెప్టెంబర్‌ మధ్య 99 శాతం మేర వర్షపాతం నమోదు అవుతుందని పేర్కొంది. ఉత్తర, ఈశాన్య భారత్‌లో కొన్ని ప్రాంతాలు మినహా అన్నిచోట్ల.. ఏపీ, తెలంగాణ, కర్ణాటకలో సాధారణం కంటే అధిక వర్షపాతం ఉంటుందని తెలిపింది. గుజరాత్, మహారాష్ట్రలోనూ సాధారణం కంటే అదనపు వర్షపాతం నమోదు అవుతుందని అంచనా వేసిన వాతావరణశాఖ.. ముందస్తు రుతుపవన జల్లులు కూడా జోరుగానే ఉండే అవకాశం ఉందని ఐఎండీ పేర్కొంది.

ఇదీచదవండి: ఒంటిమిట్ట రామయ్య కల్యాణానికి ఏర్పాట్లు పూర్తి : తితిదే ఈవో జవహర్ రెడ్డి

Last Updated : Apr 14, 2022, 7:51 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.