ETV Bharat / city

"జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలు పాటించండి"

జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలను తప్పక పాటించాలని మున్సిపల్ శాఖ అధికారులను సీఎస్ ఆదేశించారు. ప్లాస్టిక్ పొట్లాలలో ఆహార పదార్థాలను విక్రయించే సంస్థల నుండి కొంత మొత్తాన్నిసేకరించి పర్యావరణ పరిరక్షణకు ఖర్చు చేయాలని చెప్పారు.

సీఎస్
author img

By

Published : Oct 25, 2019, 9:38 AM IST

పట్టణ ప్రాంతాల్లో ఘన, ద్రవ వ్యర్థ పదార్ధాల నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ తదితర అంశాలకు సంబంధించి జాతీయ హరిత ట్రిబ్యునల్ ఇచ్చిన ఆదేశాలను తప్పక పాటించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం మున్సిపల్ శాఖ అధికారులను ఆదేశించారు. ఎన్జీటీ ఆదేశాలపై అమరావతి సచివాలయంలో మున్సిపల్ శాఖ అధికారులతో ఆయన సమీక్షించారు. రాష్ట్రంలోని అన్ని పట్టణాల్లో ఇంటింటా ఘన, ద్రవ వ్యర్థాల సేకరణను చేపట్టి వాటిని సక్రమంగా కంపోస్టుగా తయారు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఎన్జీటి ఇచ్చిన ఆదేశాలను ఎప్పటిలోగా అమలుచేసేది స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. ప్రతి పట్టణంలో ప్లాస్టిక్ పొట్లాలలో ఆహార పదార్థాలను విక్రయించే సంస్థల నుండి కొంత మొత్తాన్ని సేకరించి పర్యావరణ పరిరక్షణకు వ్యయం చేసే విధంగా చర్యలు తీసుకోవాలని సీఎస్ ఆదేశించారు. జాతీయ హరిత ట్రిబ్యునల్ ఆదేశాలకు అనుగుణంగా అన్ని పట్టణాల్లో ఇంటింటా చెత్తసేకరణ.. వాటి సక్రమ నిర్వహణకు చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. చెత్త సేకరణకు సంబంధించి డిసెంబర్ నెలాఖరులోగా ఆన్​లైన్ మానిటరింగ్ ఆఫ్ వేస్ట్ కలెక్షన్ ప్రక్రియను పూర్తిగా అందుబాటులోకి తెస్తామని చెప్పారు. అలాగే వేస్ట్ టు ఎనర్టీ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. ఇప్పటికే గుంటూరులో ఈ విధమైన ప్లాంట్ ఏర్పాటైందని విశాఖపట్నంలో కూడా ఏర్పాటు చేస్తున్నట్టు వివరించారు.

Intro:Body:

ap_vja_12_25_waste_management_in_urban_areas__3052784_2410digital_1571938398_39

Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.