తెలంగాణ నల్గొండ జిల్లాలోని నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతోంది. ప్రాజెక్టు ఇన్ ఫ్లో 2 లక్షల 75 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం 14 క్రస్ట్ గేట్లను 10 అడుగుల మేర ఎత్తి లక్ష క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కూడా కొనసాగుతుంది. మొత్తం సాగర్ నుంచి ఔట్ ఫ్లో లక్ష 20 వేల క్యూసెక్కులుగా ఉంది. జలాశయం నీటి మట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 589.20 అడుగులు మేర నీరు నిల్వ ఉంది. సాగర్ సామర్థ్యం 312.04 టీఎంసీలు కాగా ప్రస్తుతం 309.20 టీఎంసీలకు చేరుకుంది. నాగార్జున సాగర్ నుంచి కుడి, ఎడమ కాలువలకు సాగు నీటి విడుదల కొనసాగుతోంది.
పులిచింతల ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తివేత
పులిచింతల ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల చేశారు. పులిచింతల ప్రాజెక్టు ఇన్‌ఫ్లో 1,06,055 క్యూసెక్కులు... ఔట్‌ఫ్లో 1,31,960 క్యూసెక్కులు గా ఉంది. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటి నిల్వ 45.77 టీఎంసీలు.. ప్రస్తుత నీటి నిల్వ 44.08 టీఎంసీలు. పులిచింతల ప్రాజెక్టు పూర్తి నీటిమట్టం 175 అడుగులు ఉండగా.. ప్రస్తుత నీటిమట్టం 173.91 అడుగులు కొనసాగుతోంది.