తెలంగాణలోని ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కల్లూరుగూడెంకు చెందిన సౌజన్య అనే గర్భిణి నెలలు నిండగా.. పెనుబల్లి మండల ప్రభుత్వ వైద్యశాలకు వచ్చింది. వైద్యులు ఆ మహిళకు శస్త్రచికిత్స నిర్వహించి పాపకు పురుడు పోశారు.
5 కిలోల 100 గ్రాముల బరువుతో ఆడ శిశివు జన్మించిందని డాక్టర్ రమేశ్ తెలిపారు. ఇంత బరువుతో ఒక శిశువు పుట్టడం అరుదైన ఘటనగా చెప్పారు. మహిళ, శిశువు ఆరోగ్యంగా ఉన్నట్లు వెల్లడించారు.
ఇదీ చూడండి: