పెట్రోల్, డీజిల్ ధరలపై నిర్ణయాలు.. కేంద్రం తీసుకున్న వెంటనే రాష్ట్రాలు తీసుకోలేవని ఆర్థికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ వ్యాఖ్యానించారు(finance minister buggana on petrol prices news). దిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ సహా మరికొందరిని కలిసిన ఆయన...రాష్ట్రానికి సంబంధించిన అపరిష్కృత అంశాలపై చర్చించినట్లు వెల్లడించారు.
'అన్‌రాక్ ఆర్బిట్రేషన్ లీగల్ అంశం.. సుదీర్ఘ ప్రక్రియ ఉంది. దీనిపై కేంద్రమంత్రులతో చర్చించా. పెట్రోల్, డీజిల్ ధరల తగ్గింపుపై ఆచితూచి నిర్ణయం తీసుకోవాలి. రాష్ట్రానికి ఉండే ఖర్చులు వేరు.. కేంద్రం ఖర్చులు వేరు. ఇప్పటికే పెంచిన పన్నులను కొంత తగ్గించాం. రాష్ట్రానికి పెట్రోల్, ఎక్సైజ్ ద్వారానే ఆదాయం వస్తుంది. కేంద్రం తీసుకున్నంత సులభంగా రాష్ట్రాలు నిర్ణయం తీసుకోలేవు ' - బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర ఆర్థిక మంత్రి
ఇదీ చదవండి: చైనా కమ్యూనిస్టు పార్టీ కీలక భేటీ- జిన్‌పింగ్‌కు మూడోసారి పగ్గాలు!