ఆనందయ్య ఔషధంపై హైకోర్టులో సోమవారం విచారణ జరగనుందని ఆయుష్ కమిషనర్ రాములు తెలిపారు. ఔషధ (Anandaiah Medicine) పరీక్షలపై రేపు చివరి నివేదిక వస్తుందని వెల్లడించారు. నివేదికలను అధ్యయన కమిటీ మరోసారి పరిశీలిస్తుందన్న రాములు... సీసీఆర్ఏఎస్ అధ్యయన నివేదిక రేపు వచ్చే అవకాశం ఉందని వివరించారు. నివేదికతో పాటు హైకోర్టు తీర్పు వచ్చాక ఔషధ పంపిణీపై నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు.
కంటి మందుపై ఇబ్బందులు లేకుండా చూడాలని సీఎం ఆదేశించారని రాములు వివరించారు. ఇప్పటివరకు విచారణ నివేదికలు సానుకూలంగా వచ్చాయని తెలిపారు. టెలిఫోన్ విచారణలో చాలా మంది సానుకూలంగా చెప్పారని... ఔషధంపై క్లినికల్ ట్రయల్స్ ఇంకా ప్రారంభించలేదని వెల్లడించారు. ఔషధంపై ఆనందయ్య దరఖాస్తు చేసుకోవాలన్న ఆయుష్ కమిషనర్... ఆయుర్వేద విభాగం గుర్తింపు కోసం దరఖాస్తు చేయాలని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... వారం రోజుల తరువాత కృష్ణపట్నం చేరుకున్న ఆనందయ్య