ETV Bharat / city

కూతుళ్లపై తండ్రి అత్యాచారం.. వచ్చిరాని మాటలతో తల్లికి చెప్పిన పిల్లలు - ఏపీ నేర వార్తలు

Dubbaka rape incident: మానవ సమాజం తలదించుకొనే మరో ఘటన వెలుగుచూసింది. తండ్రి అనే పదమే చీదరించుకునేలా తోడేలై ప్రవర్తించాడు ఓ వ్యక్తి. కాపాడాల్సినవాడే కామాంధుడై కాటేశాడు. అన్నింటా తోడుంటాననే నమ్మకాన్ని ఇవ్వాల్సిన నాన్నే.. వారిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. మానవ సమాజం తలదించుకొనే ఈ అవమానీయ ఘటన సిద్దిపేట జిల్లా దుబ్బాకలో జరిగింది.

Dubbaka rape incident
కూతుళ్లపై తండ్రి అత్యాచారం
author img

By

Published : Oct 9, 2022, 3:46 PM IST

Dubbaka rape incident: సమాజంలో జరుగుతున్న వరుస అత్యాచారాలు, యాసిడ్​ దాడులు..ప్రేమోన్మాదుల నుంచి తన కూతుళ్లను ఎలా కాపాడుకోవాలని ఆడపిల్లల తండ్రులు ఆందోళన చెందుతున్న ఈ సమయంలో... కంటికి రెప్పలా చూడాల్సిన వాడే కామంధుడయ్యాడు. కంచె చేను మేసినట్లు ప్రవర్తించాడు ఈ కసాయి తండ్రి.. సొంత కూతుళ్లు అని మరిచి వారిపైనే దారుణానికి ఒడిగట్టాడు.

తెలంగాణలోని సిద్దిపేట జిల్లా దుబ్బాకా సీఐ మున్నూరు కృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం.. మిరుదొడ్డి మండలానికి చెందిన ఓ మహిళ తన భర్త చనిపోగా.. తన ఇద్దరు ఆడపిల్లలతో జీవనం కొనసాగిస్తోంది. ఈ క్రమంలో తనకు, తన పిల్లలకు తోడుగా ఉంటాడని భావించి మూడేళ్ల కిందట ఓ వ్యక్తిని రెండో వివాహం చేసుకుంది. భర్తతో సహా 8, 6 ఏళ్ల వయస్సు కలిగిన బాలికలతో ఆరు నెలల క్రితం బతుకుదెరువుకు దుబ్బాకకు వచ్చి కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. శనివారం సదరు తల్లి తన పిల్లలను పెంపుడు తండ్రి వద్ద వదిలేసి కూలీ పనులకు వెళ్లగా.. ఇదే అదునుగా ఆ పెంపుడు తండ్రి ఆ ఇద్దరు చిన్నారులపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వారి కేకలు విన్న ఇంటి పక్కవాళ్లు అక్కడికి వచ్చే సరికి.. అతడు అక్కడ నుంచి జారుకున్నాడు.

వచ్చిరాని మాటలతో తల్లికి చెప్పిన పిల్లలు: సమాచారం అందుకున్న చిన్నారుల తల్లి ఇంటికి చేరుకొని పిల్లలను ఆరా తీయగా.. కొంతకాలంగా ఇంట్లో ఎవరూ లేనప్పుడు తమపై తండ్రి చేస్తున్న అఘాయిత్యాన్ని వచ్చి రాని మాటలతో చెబుతుండగా అక్కడున్న వారంతా కంటతడి పెట్టారు. తల్లి తన రెండో భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేయగా.. అతడిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. నిందితుడి కోసం గాలింపు చర్యలు వేగవంతం చేశామని సీఐ వివరించారు. పిల్లలను, తల్లిని సిద్దిపేట భరోసా కేంద్రానికి తరలించినట్లు వారు తెలిపారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.