గుంటూరు జిల్లా తాడేపల్లిలో విధించిన యూ-1 (రిజర్వ్ జోన్)ను వెంటనే ఎత్తేయాలని రైతులు డిమాండ్ చేశారు. గత ప్రభుత్వ హయంలో అమరానగర్ ప్రాంతంలోని 178 ఎకరాలను రాజధాని అవసరాల కోసం యూ-1 జోన్‌గా ప్రకటించారు. ఈ భూముల్లో ఎలాంటి క్రయవిక్రయాలు, రిజిస్ట్రేషన్లు జరగకుండా నిషేధం విధించారు. నాటి నుంచి రైతులు పలు దఫాలుగా ఆందోళనలు చేస్తూనే ఉన్నారు.
2019 ఎన్నికల సమయంలో అధికారంలోకి వస్తే యూ-1 జోన్ ఎత్తివేస్తామని వైకాపా నేతలు హామీ ఇచ్చారు. ఈ విషయంపై ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి సమక్షంలో జగన్‌ను సైతం కలిశారు. 2 నెలల్లో ఎత్తివేస్తామని చెప్పారని.. ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోలేదని రైతులు వాపోయారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలన్నారు. జాతీయ రహదారిని అనుకొని ఉన్న తమ భూములను అవసరాల కోసం అమ్ముకోలేకపోతున్నామని ఆవేదన చెందారు.
ఇదీ చదవండి: