CRDA: ఏపీ ప్రభుత్వం తాను పట్టిన కుందేలుకు రెండే కాళ్లు అన్న చందగా ప్రవర్తిస్తోంది. ఓ వైపు రాజధాని బిల్లును మరో రూపంలో మళ్లీ తెచ్చేందుకు ప్రయత్నిస్తునే.. రాజధాని ప్రాంతంలో పేదలకు ఇళ్లపట్టాల పంపిణీ పేరిట కొత్త వివాదానికి తెర లేపుతోంది. ఇదే అంశంపై రాజధాని రైతులు ఐకాసా నేతలు జగన్ ప్రభుత్వంపై మండిపడుతున్నారు.
సీఆర్డీఏ చట్టానికి సవరణలు నిరసిస్తూ రాజధాని రైతులు.. ఆ బిల్లు ప్రతులను తగలపెట్టారు. ఇచ్చిన హామీ మేరకు రాజధానిని అభివృద్ధి చేసి ఎన్ని చట్ట సవరణలనైనా చేసుకోవాలన్నారు. పేదలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు తాము వ్యతిరేకం కాదని స్పష్టం చేశారు. రాజధాని ప్రాంతంలో ఇళ్లు లేని పేదలు 14వేల మంది ఉన్నారని మొదట వారికి కేటాయించి రాజధానిని అభివృద్ధి చేయాలని రైతులు డిమాండ్‌చేశారు.
ఇవీ చదవండి: