ETV Bharat / city

భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల ఎదురుచూపు - ఏపీలో రైతు భరోసా పథకం

సాయం ఏదైనా రైతుకు అవసరానికి ఉపయోగపడాలి. పంటల బీమా ఎప్పుడో ఆరు నెలలు, ఏడాదికి వస్తే రైతు గట్టెక్కలేడు. భారీ వర్షాలు, వరదలతో పంట నష్టపోయి దెబ్బతిన్న రైతుల పరిస్థితి దారుణంగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడి రాయితీని విడుదల చేయడంతో తాత్కాలిక ఉపశమనం లభించినా.. మరో పంట వేసుకోవాలంటే అప్పు తెచ్చుకోవాల్సిందే. బ్యాంకుల్లో ఇప్పటికే తెచ్చిన రుణం తిరిగి చెల్లించే పరిస్థితి లేదు. ప్రైవేటు అప్పులూ పుట్టేలా లేవు. ఇలాంటి తరుణంలో ఉచిత పంటల బీమా పరిహారాన్ని సత్వరమే అందిస్తే వెసులుబాటు లభిస్తుందనే ఆశ రైతుల్లో వ్యక్తమవుతోంది.

bharosa eenadu
bharosa eenadu
author img

By

Published : Nov 23, 2020, 6:30 AM IST

భారీ వర్షాలతో నష్టపోయిన రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. పైసా ఆదాయం రాక.. చేతిలో చిల్లిగవ్వ లేక అనేక ఇబ్బందులు పడుతున్నారు. సత్వరం బీమా సొమ్ము ఇస్తేనే రెండో పంటకు పెట్టుబడి లభిస్తుంది. లేదంటే ఇప్పటికే కుదేలైన రైతు పరిస్థితి మరింత దారుణంగా మారుతుంది.

అక్టోబరులో కురిసిన భారీ వర్షాలు, వరదలకు పలు జిల్లాల్లో అరటి, బొప్పాయి, మిరప పంటలు కుళ్లిపోయాయి. ఎకరాకు రూ.78,805 నష్టం జరిగిందని ఉద్యానశాఖ అంచనా. మళ్లీ పండ్ల తోటలు వేసుకోవాలంటే ఎకరాకు కనీసం రూ.50వేలైనా అవసరం. పెట్టుబడి రాయితీ తాత్కాలిక ఉపశమనమే. పంటల బీమా సత్వరం ఇస్తేనే భరోసా లభిస్తుంది.

వరదల్లో 3.51 లక్షల ఎకరాల వరి దెబ్బతింది. రబీ పంట వేసుకోవాలంటే ఎకరాకు రూ.15-20 వేలైనా ఉండాలి. పెట్టుబడి రాయితీగా ఎకరాకు ఇచ్చిన రూ.6వేలు రబీకి చాలదు. ఎకరాకు రూ.32 వేలకు పైగా వచ్చే బీమా సొమ్ముతోనే.. మరో పంట వేసుకునే ధైర్యం వస్తుంది.

జులై, సెప్టెంబరులో సాధారణం కంటే 171% అధికంగా వానలు కురవడంతో రాయలసీమ జిల్లాల్లో వేరుసెనగ రైతులకు కోలుకోలేని దెబ్బతగిలింది. ఎకరాకు ఒకటి రెండు క్వింటాళ్లే దిగుబడి రావడంతో పాటు నాణ్యత లేకపోవడంతో రూ.25 వేలకు పైగా నష్టపోయారు. మొత్తం సాగు విస్తీర్ణం 18.57 లక్షల ఎకరాలుంటే.. అందులో 14.27 లక్షల ఎకరాల పంట దెబ్బతింది. బీమా సత్వరం అందితేనే వీరికీ మరో పంట పెట్టుబడికి వెసులుబాటు లభిస్తుంది.

పత్తి రైతుల పరిస్థితీ ఇంతే. ఎకరానికి రూ.25వేల పెట్టుబడి పెట్టినా రెండు క్వింటాళ్ల దిగుబడీ రాని రైతులు ఉన్నారు. ముందే కౌలు చెల్లించిన రైతులు పెట్టుబడితో పాటు అదనంగా ఎకరాకు రూ.20 వేల వరకు నష్టపోయారు. పెట్టుబడి రాయితీతో పాటు తక్షణ బీమా అందితేనే వీరికి ప్రయోజనం.

భారీ వర్షాలు, వరదల కారణంగా జూన్‌ నుంచి అక్టోబరు వరకు సుమారు 20.61 లక్షల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా.. రూ.3,084 కోట్ల మేర పంట నష్టం జరిగిందని ఇటీవల వచ్చిన కేంద్ర బృందానికి రాష్ట్రం నివేదించింది. రైతులకు పెట్టుబడి రాయితీ రూపంలో రూ.1,192 కోట్ల వరకు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. ఇందులో ఇప్పటికే రూ.260 కోట్లు విడుదల చేసింది.

గింజ రాలదు.. కిలో కోయలేరు

బీమా పరిహారం చెల్లింపులో పంట కోత ప్రయోగాలు, వాతావరణ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటారు. భారీ వరదలతో గోదావరి, కృష్ణా తీరంలోని లంక పొలాలతో పాటు ఎర్రకాలువ, ఏలేరు పరిధిలో పంటలన్నీ మునిగిపోయాయి. వారం పైగా నీరు నిల్వ ఉండటంతో మొత్తం కుళ్లిపోయాయి. వడ్ల గింజ గానీ, కిలో పండ్లు, కూరగాయలు గానీ చేతికందవు. కర్నూలు జిల్లాలోనూ ఇదే పరిస్థితి. ఎర్రకాలువ, ఏలేరు, సుబ్బారెడ్డిసాగర్‌ పరిధిలో పంట నష్టాన్ని లెక్కించడానికి ఏమీ మిగల్లేదు. కోయడానికి పంటలే లేవు. ఇక పంట కోత, ఇతర అంశాలతో పరిహారం గణించడానికి అవకాశమే లేదు. ప్రస్తుతం ఆధునిక సాంకేతిక అందుబాటులోకి రావడంతో నష్టం అంచనాలు నాలుగైదు రోజుల్లో అందుతాయి. పంట కోతలు పూర్తయ్యేలోగా మొత్తం సమాచారం ఆన్‌లైన్‌ ద్వారా రాష్ట్ర స్థాయికి చేరుతుంది. దీంతో పెట్టుబడి రాయితీ, బీమా పరిహారాలను నిర్దేశిత సమయంలో అందించే వీలుంటుంది.

ప్రభుత్వం చేతిలో పనే

పంట నష్టం సంభవించినపుడు బీమా సంస్థలు క్షేత్రస్థాయిలో పరిశీలించి నష్టాన్ని లెక్కిస్తాయి. అయితే 2019 రబీ, 2020 ఖరీఫ్‌లో ప్రభుత్వమే ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేస్తోంది. దీన్నిబట్టి బీమా సాయం మంజూరు వ్యవహారమంతా సర్కారు చేతుల్లో పనే. నష్టం కళ్లముందే కనిపిస్తున్నందున ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంటే.. బీమా పరిహారం రైతుల ఖాతాల్లో జమ అవుతుంది. రైతుల పెట్టుబడి కష్టాలూ తీరతాయి.

bharosa eenadu
భారీ వర్షాలతో నష్టపోయిన రైతుల ఎదురుచూపు

ఇదీ చదవండి:

పోలవరం ఏమైనా నిషిద్ధ ప్రాంతమా?: చంద్రబాబు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.