ETV Bharat / city

వ్యవసాయ చట్టాల రద్దుకు డిమాండ్ చేస్తూ రాష్ట్రవ్యాప్త నిరసనలు - దిల్లీలో ఆందోళన చేస్తున్న రైతులకు సంఘీభావంగా ఏపీలో రైతులు, కార్మికుల ధర్నా

నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దిల్లీలో ఆందోళనలు చేస్తున్నారు. ఏపీలోని వివిధ జిల్లాల్లో రైతు, కార్మిక సంఘాలు వారికి మద్ధతుగా సంఘీబావ ప్రదర్శనలు నిర్వహించాయి. రైతే దేశానికి వెన్నెముక అంటూనే వారి పాలిట ఉరితాళ్లుగా మారే చట్టాలను చేయడాన్ని తప్పుపట్టారు. ఆయా చట్టాలను కేంద్రం రద్దు చేయాలంటూ డిమాండ్ చేశారు.

farmers protest
ధర్నా నిర్వహిస్తున్న ఆందోళనకారులు
author img

By

Published : Dec 1, 2020, 5:44 PM IST

కార్మికులు, కర్షకులు అనే భేదం లేకుండా.. రాష్ట్ర వ్యాప్తంగా నూతన వ్యవసాయ చట్టాలపై నిరసనలు చెలరేగాయి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో ఆందోళన నిర్వహిస్తున్న రైతులకు.. ఏపీలోని పలు జిల్లాల్లో సంఘీభావ ప్రదర్శనలు జరిగాయి. ఆయా చట్టాలు కార్పొరేట్ శక్తులకు మాత్రమే మేలు చేస్తాయంటూ.. వివిధ రైతు సంఘాల నాయకులు మండిపడ్డారు.

నెల్లూరు జిల్లాలో...

కేంద్రం అమల్లోకి తెచ్చిన దుర్మార్గపు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని దిల్లీలో రైతులు చేస్తున్న ఆందోళనకు సంఘీభావంగా.. నెల్లూరు జిల్లా ఉదయగిరిలో రైతు సంఘం నాయకులు నిరసన చేపట్టారు. రైతుల పొట్ట కొట్టి వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తులకు అప్పగించాలని పాలకులు దురుద్దేశంతో ఆలోచిస్తున్నారని మండిపడ్డారు. ఆ చట్టాల రద్దుకు పార్లమెంట్​లో బిల్లు ప్రవేశపెట్టాలని.. శాసనసభలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు. వ్యవసాయ విద్యుత్ మోటర్​లకు మీటర్లు ఏర్పాటు చేసేందుకు తెచ్చిన జీవోనూ ఉపసంహరించుకోవాలన్నారు. ఈ ప్రజా వ్యతిరేక విధానాలకు మద్ధతు పలుకుతున్న వైకాపా, తెదేపాలకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు.

రైతాంగానికి వ్యతిరేకంగా కేంద్రం తీసుకొచ్చిన చట్టాలను రద్దు చేయాలని కోరుతూ.. మర్రిపాడు మండల కేంద్రంలో రైతు సంఘాలు నిరసన వ్యక్తం చేశాయి. దిల్లీలో రైతు సంఘాలు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా.. సీపీఎం ఆధ్వర్యంలో జాతీయ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. వ్యాపారస్తులు రైతుల వద్ద కొనడం మినహా.. రైతు పంటను ఎక్కడికైనా తీసుకువెళ్లి అమ్ముకునే పరిస్థితి లేదని జిల్లా రైతు సంఘం అధ్యక్షులు మూలి వెంగయ్య స్పష్టం చేశారు. లోక్​సభలో మందబలంతో బిల్లు పాస్ చేయించారని.. రాజ్యసభలో మెజారిటీ లేకపోయినా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసి మూజువాణి ఓటుతో బిల్లు ఆమోదించారని ఆయన ఆరోపించారు. రైతాంగ విధానాలను వ్యతిరేకించే చట్టాలపై.. కర్షకులందరూ ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

అనంతపురం జిల్లాలో...

దిల్లీ పరిసరాల్లో కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులను.. ఉగ్రవాదులతో, మావోయిస్టులతో భాజపా నాయకులు పోల్చడం దారుణమని సీపీఎం జిల్లా ప్రధాన కార్యదర్శి రాంభూపాల్ విమర్శించారు. ఆ పార్టీ అనంతపురం నగర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. రైతు వ్యతిరేక చట్టాలను నిరసిస్తూ వేల సంఖ్యలో అన్నదాతలు పాల్గొనడం ఇదే మొదటి సారి అన్నారు. ఇప్పటికే రైల్వే, బీఎస్ఎన్ఎల్ వంటి సంస్థలను బడా వ్యాపారులకు కేంద్రం అప్పనంగా ముట్ట చెబుతోందని విమర్శించారు. దేశానికి వెన్నెముకగా ఉన్న వ్యవసాయ రంగాన్నీ కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేయాలని చూస్తోందని మండిపడ్డారు.

నూతన వ్యవసాయ చట్టాలపై గుంతకల్లులోని పొట్టి శ్రీరాములు కూడలిలో పోరాటం చేస్తున్న రైతులకు.. ఐఎఫ్​టీయూ నేతలు మద్ధతు ప్రకటించారు. అన్నదాతల ఉద్యమంపై మోదీ సర్కారు నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ఆ చట్టాలు రైతుల మెడకు ఉరి తాడులా ఉన్నాయన్నారు. కనీస మద్దతు ధరలు ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అవి ఎక్కడా అమలు కావడం లేదని ఆరోపించారు. నూతన చట్టలాతో కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూరడం మినహా.. సామాన్య రైతులకు ఎటువంటి ఉపయోగమూ లేదన్నారు. వాటిని కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

తూర్పుగోదావరిలో...

మోదీ ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ, విద్యుత్ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీలో జరుగుతున్న రైతాంగ ఉద్యమానికి సంఘీభావంగా.. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు పాత బస్టాండ్ వద్ద ఐఎఫ్​టీయూ నాయకులు ధర్నా నిర్వహించారు. కేంద్రం మొండి వైఖరి విడనాడాలని.. రైతులపై దాడిని ఆపాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ చట్టాల వల్ల వ్యవసాయరంగం తీవ్ర సంక్షోభంలో పడుతుందని, రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటుందని.. ఆ సంస్థ జిల్లా ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వరరావు వివరించారు. రైతు దేశానికి వెన్నెముక అని చెబుతూనే.. వారికి ఉరితాడుగా మారే చట్టాలు చేయడాన్ని తప్పుపట్టారు. ప్రజలందరిపై భారం మోపే విద్యుత్ సంస్కరణల చట్టాన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

ఎన్నడూ లేనివిధంగా లక్ష ట్రాక్టర్లతో మూడున్నర లక్షల మంది రైతులు.. దిల్లీ చుట్టూ జాతీయ రహదారులను దిగ్బంధించి ఉద్యమం సాగిస్తున్నారని వెంకటేశ్వరరావు పేర్కొన్నారు. వివిధ రాష్ట్రాలలో సుమారు కోటి యాభై లక్షల మంది ఈ నిరసనల్లో పాల్గొంటున్నారన్నారు. ఇంత భారీ ఎత్తున ఉద్యమం సాగిస్తున్నా.. కేంద్ర ప్రభుత్వం తమ విధానాలు మార్చుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికైనా రైతు నాయకులతో చర్చలు జరిపి.. వ్యవసాయ చట్టాల రద్దుతో రైతుల పోరాటానికి ముగింపు పలకాలని డిమాండ్ చేశారు. పలు కార్మిక సంఘాల నాయకులు, కార్మికులూ ఏలూరులో సంఘీభావ ప్రదర్శన నిర్వహించారు. ఆయా చట్టాల రద్దుతో పాటు.. రైతు సమస్యలను పరిష్కరించాలని నినాదాలు చేశారు.

ఇదీ చదవండి:

రైతులతో కేంద్రం చర్చలు- సమస్యలు తీరేనా?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.