ETV Bharat / city

FAKE CHALLANS: ఆ విధానాన్ని ఎందుకు వదిలేశారు?

author img

By

Published : Aug 22, 2021, 7:12 AM IST

రాష్ట్రంలో సబ్‌ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో రీకన్సలేషన్‌ (పునఃపరిశీలన) ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. ఈ నకిలీ చలాన్లతో రూ.5.85 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు అధికారులు చెబుతున్నారు.

sub registration office
సబ్‌ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో అవకతవకలు

రాష్ట్రంలో సబ్‌ రిజిస్ట్రార్ల కార్యాలయాల్లో నకిలీ చలాన్ల అంశం వెలుగులోకి వచ్చిన నేపథ్యంలో రీకన్సలేషన్‌ (పునఃపరిశీలన) ఎందుకు చేయడం లేదన్న ప్రశ్న తలెత్తుతోంది. రిజిస్ట్రేషన్ల ప్రక్రియలో నకిలీ చలాన్లవల్ల ఇంతవరకూ దాదాపు రూ.5.85 కోట్ల మేర అక్రమాలు జరిగినట్లు తేల్చారు. ఇంకా ఎంత మేర ప్రభుత్వం నష్టపోయిందో లెక్కలు తేలాల్సి ఉంది. అధికార యంత్రాంగం ఆ ప్రయత్నాల్లోనే ఉంది. ఈ నేపథ్యంలో గతంలో జమా ఖర్చులను సరిపోల్చుకునే రీ కన్సలేషన్‌ ప్రక్రియపై తాజాగా చర్చ సాగుతోంది. గతంలో ప్రభుత్వ శాఖలన్నీ ప్రతి నెలా రీ కన్సలేషన్‌ చేసి ఖజానా అధికారుల నుంచి ధ్రువీకరణ పొందేవి. డిజిటల్‌ చెల్లింపులు మొదలయ్యాక ఆ ప్రక్రియను చేపట్టడం లేదు. నిజానికి ఇలా లెక్కలు సరిపోల్చుకోవాల్సిన అవసరం లేదని ఎలాంటి ఆదేశాలు లేవు. ట్రెజరీ కోడ్‌, ఫైనాన్షియల్‌ కోడ్‌ మార్చలేదు. అయినా రీ కన్సలేషన్‌ ఎందుకు వదిలేశారన్న చర్చ తెరపైకి వచ్చింది. ప్రతినెలా చెల్లింపులు, వసూళ్లు సమగ్రంగా ఉన్నాయా? ఎంత ఉన్నాయనే లెక్కలు నెలకోసారి సరిపోల్చుకోవాలి. అలా చేసినప్పుడు లోపాలు జరిగినా త్వరగా గుర్తించేవారు.

చలాన్ల విధానం ఇలా..

* గతంలో ప్రభుత్వశాఖల్లో ఏ సేవ పొందాలన్నా చలాన్లు కట్టేవారు. వాటికి నేరుగా చెల్లింపులు జరిపేవారు. తొలుత ఖజానాశాఖ కార్యాలయానికి వెళ్లి నంబరు వేయించుకుని, బ్యాంకు వద్దకు వెళ్లి 3 చలానా కాపీలను సమర్పించి డబ్బులు చెల్లించేవారు. అందులో ఒక కాపీ చెల్లింపుదారుడికి ఇచ్చి మరోటి ఖజానా కార్యాలయానికి పంపేవారు. సేవలు పొందే వ్యక్తి ఆ చలానాను సంబంధిత కార్యాలయంలో అందించి సేవలు పొందేవారు.

* ప్రతి ప్రభుత్వశాఖలో ట్రెజరీ బిల్లు రిజిస్టరు, చలానా రిజిస్టరు నిర్వహించేవారు. వాటిలో బిల్లుల వివరాలు, చలానా వివరాలు ఉండేవి. నెలాఖరులో ట్రెజరీ కార్యాలయానికి వెళ్లి వాటిని సరిపోల్చుకుని అక్కడ లెక్కలు సరిపోయాక ధ్రువీకరణ పత్రం తీసుకునేవారు.

డిజిటల్‌ చెల్లింపుల్లో...

ప్రస్తుతం డిజిటల్‌ చెల్లింపులు మొదలయ్యాయి. కాగితపు ప్రతులు ఏమీ ఉండటం లేదు. దీంతో రిజిస్టర్ల నిర్వహణ, నమోదు ప్రక్రియలు, ఖజానాకు వెళ్లి సరిపోల్చి చూసుకోవడం ఆగిపోయింది.

* గతంలో బిల్లులను పరిశీలించి అన్నీ సరిగా ఉంటే పాస్‌ అయినట్లు ధ్రువీకరణ రాసేవారు. లేకుంటే ఆడిట్‌కు పంపేవారు. చలాన్ల రిజిస్టరు పరిశీలించి ఆ హెడ్‌కు సంబంధిత మొత్తం జమ అయిందో లేదో సరిపోల్చి చూసుకుని ధ్రువీకరణ జారీ చేసేవారు.

* డిజిటల్‌ చెల్లింపులు, సీఎఫ్‌ఎంఎస్‌ విధానం రావడంతో రిజిస్టర్లు నిర్వహించడం లేదు. రీ కన్సలేషన్‌ చేయడం లేదు. భౌతికంగా కాగితాలు లేకున్నా ఖజానాశాఖ వద్ద, ఆయా ప్రభుత్వశాఖల వద్ద సమాచారం అంతా ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటుంది. దాని ఆధారంగా తనిఖీ చేసుకోవచ్చు.

బాధ్యత సర్వీసు ప్రొవైడర్లదే

చలానా ద్వారా సంబంధిత మొత్తాలను పొంది సర్వీసు అందించే శాఖలు జమా లెక్కలను ఎందుకు సరిచూసుకోవడం లేదనే ప్రశ్న తలెత్తుతోంది. చలానా నంబరు చూసుకుని సేవ ఎలా అందిస్తారనే ప్రశ్న వస్తోంది. ఎంత మొత్తం జమ అయిందో చూసుకోవాల్సిన బాధ్యత సర్వీసు ప్రొవైడర్‌దే కదా అని ప్రశ్నిస్తున్నారు. ఒకవేళ ఆ సమాచారం అందుబాటులో లేకపోతే దాన్ని అందుబాటులోకి తెచ్చుకోవాల్సిన బాధ్యత సంబంధిత అధికారులది కాదా అని అడుగుతున్నారు. గతంలో ఇసుక రవాణా సమయంలో ఒకే చలానా చూపించి అనేక ట్రిప్పులు రవాణా చేసే ఉదంతాలను ప్రస్తావిస్తున్నారు.

సీఎఫ్‌ఎంఎస్‌లో తనిఖీలు

ప్రస్తుతం రిజిస్ట్రేషన్ల అక్రమ చలాన్ల నేపథ్యంలో సీఎఫ్‌ఎంఎస్‌లో పాత వ్యవహారాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఏ స్థాయిలో అక్రమాలు జరిగాయో లెక్క తేల్చి ఆ మొత్తాలు తిరిగి రాబట్టుకోవలసి ఉంటుంది. ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ప్రత్యామ్నాయాలపై ఆలోచిస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇదీ చదవండీ.. STEEL PLANT: 'విశాఖ ఉక్కుపై పునరాలోచించాలి'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.