జిల్లాల్లో అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, వినియోగం, జాతీయ, అంతర్జాతీయ రవాణా, ఓడరేవుల వద్ద నిల్వలు, విక్రయాలపైన 2012లో రూపొందించిన నిబంధనలను ఎస్పీలకు డీజీపీ గౌతం సవాంగ్ వివరించారు. అమ్మోనియం నైట్రేట్ వినియోగంపై కచ్చితమైన నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. అతిక్రమించిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకునేందుకు వెనకాడవద్దని ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న అమ్మోనియం నైట్రేట్ నిల్వలు, పేలుడు పదార్థాల రవాణా, వినియోగం, అమ్మకాలు, కొనుగోళ్లు, నిల్వ కేంద్రాలు మొదలైన వాటికి సంబంధించి అధికారులు తనిఖీలు నిర్వహించి, పర్యవేక్షించాలని ఎస్పీలను ఆదేశించారు.
ఇదీ చదవండీ... 'ఒక తప్పును కప్పిపుచ్చుకునేందుకు వంద తప్పులు చేస్తున్నారు'