అమెరికా అధ్యక్ష ఎన్నికల పోరు రసవత్తరంగా కొనసాగుతోంది. డొనాల్డ్ ట్రంప్, ప్రత్యర్థి జో బైడెన్‌ల మధ్య హోరాహోరీగా కొనసాగుతున్న ఈ పోరులో గెలుపు ఎవరి సొంతమవుతుందోనని యావత్ ప్రపంచం ఆసక్తిగా ఎదురుచూస్తోంది. మ్యాజిక్ ఫిగర్‌కు 270 ఎలక్టోరల్ ఓట్లు సాధించాల్సి ఉంది. అయితే, ఇప్పటివరకు జరిగిన లెక్కింపులో డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌కు 238 ఎలక్టోరల్ ఓట్లు రాగా.. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌నకు 213 ఎలక్టోరల్ ఓట్లు వచ్చినట్టు అమెరికా మీడియా వెల్లడించింది. ఇంకా ఏడు రాష్ట్రాల్లో కౌంటింగ్ జరుగుతోంది.
అయితే రెండు, మూడు రోజులైనా అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు తేలే అవకాశం లేదంటున్నారు అమెరికాలోని రాజనీతి శాస్త్ర అధ్యాపకులు ప్రొ. కృష్ణ కుమార్ తుమ్మల. లక్షలాది ఓట్లు ఇంకా లెక్కించాల్సి ఉన్నందున్న ఫలితాలపై స్పష్టత వచ్చేందుకు కొంత సమయం పడుతుందని ఈటీవీ భారత్‌కు ఇచ్చిన ఇంటర్వూలో వెల్లడించారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా భారత్‌తో స్నేహ బంధాల విషయంలో పెద్దగా ఏ మార్పు ఉండదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి