ETV Bharat / city

extra fees for building constructions: పట్టణాల్లో ఇంటి నిర్మాణ భారం.. ఆరు రెట్లు పెరిగిన రుసుములు! - land issues

extra fees for building constructions: రాష్ట్రంలోని పట్టణ పంచాయతీల్లో ఇంటి నిర్మాణం పెను భారంగా మారింది. యూడీఏలలో చేర్చిన ప్రాంతాల్లో వివిధ నిర్మాణాల కోసం జీవో 12 ప్రకారం ఫీజులు వసూలు చేయడంతో... ఏకంగా రుసుములు ఆరు రెట్లు పెరిగాయి.

exara-fees-for-building-construction-at-nagara-panchayaths-in-ap
పట్టణాల్లో ఇంటి నిర్మాణ భారం.. ఆరు రెట్లు పెరిగిన రుసుములు!
author img

By

Published : Dec 27, 2021, 8:38 AM IST

Updated : Dec 27, 2021, 10:34 AM IST

extra fees for building constructions: రాష్ట్ర ప్రభుత్వం రెండున్నరేళ్ల వ్యవధిలో 12వేల చదరపు కిలోమీటర్ల కొత్త ప్రాంతాన్ని పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ)ల పరిధిలో చేర్చింది. దీంతో వీటి పరిధి 71,329 చదరపు కిలోమీటర్లకు చేరింది. రాష్ట్రం మొత్తం భూభాగంలో 43.76% ప్రాంతం పట్టణాభివృద్ధి సంస్థల్లోనే ఉంది. దేశంలోనే అత్యధిక విస్తీర్ణం కలిగిన వాటిలో ముఖ్యమంత్రి జగన్‌ సొంత జిల్లా కడపలోని అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థ ఒకటి. ఈ జిల్లా మొత్తం విస్తీర్ణంలో 85% ప్రాంతం యూడీఏ పరిధిలోనే ఉంది. అయితే... గ్రామ పంచాయతీలను పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో చేర్చడంతో నిర్మాణాలు, లేఅవుట్ల అనుమతుల కోసం ప్రజలు, స్థిరాస్తి వ్యాపారులపై అదనపు భారం పడుతోంది. రుసుములు ఏకంగా దాదాపు ఆరు రెట్లు పెరగడం గమనార్హం. యూడీఏలలో చేర్చిన ప్రాంతాల్లో వివిధ నిర్మాణాల కోసం జీవో 12 ప్రకారం ఫీజులు వసూలు చేస్తున్నారు. వీటికి డెవలప్‌మెంట్‌ ఛార్జీలు అదనం.

  • గ్రామ పంచాయతీల పరిధిలో 100 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఇంటి నిర్మాణానికి అనుమతుల కోసం ఇప్పటివరకు రూ.910 చెల్లిస్తే సరిపోయేది. అదే పంచాయతీని పట్టణాభివృద్ధి సంస్థ (యూడీఏ) పరిధిలో చేర్చాక రూ.5,920 చెల్లించాల్సి వస్తోంది.
  • 100 చదరపు మీటర్లలో నివాసేతర భవన నిర్మాణం అనుమతుల కోసం గ్రామ పంచాయతీలకు రూ.1,510 చెల్లించేవారు. అదే పంచాయతీ... యూడీఏ పరిధిలో చేరాక రూ.8,920 చెల్లించాల్సి వస్తోంది.
  • గ్రామ పంచాయతీల పరిధిలో 5 ఎకరాల్లో లేఅవుట్‌కు అనుమతుల కోసం రూ.40,400 చెల్లిస్తే సరిపోయేది. చదరపు మీటరుకు రూ.2 చొప్పున విధించేవారు. అదే పంచాయతీలు యూడీఏల పరిధిలోకి వెళ్లాక చ.మీ.కు రూ.4 చొప్పున మొత్తం రూ.80,800 వసూలు చేస్తుండటం గమనార్హం.

పూర్తికాని బృహత్‌ ప్రణాళికలు

గ్రామాలను యూడీఏల పరిధిలోకి చేర్చాక... రోడ్లు, తాగునీరు, మురుగు కాలువలు, వీధి దీపాలు తదితర అనేక సదుపాయాలు, సౌకర్యాలు అందుబాటులోకి వస్తాయని ప్రభుత్వం చెబుతోంది. అయితే... రాష్ట్రంలో గత ఎనిమిదేళ్లలో ఏర్పడిన పట్టణాభివృద్ధి సంస్థల్లో సగం వాటికి బృహత్‌ ప్రణాళికలు (మాస్టర్‌ ప్లాన్లు) లేవు. గోదావరి, నెల్లూరు, అనంతపురం-హిందూపురం పట్టణాభివృద్ధి సంస్థల బృహత్‌ ప్రణాళికలు రూపకల్పన దశలోనే ఉన్నాయి. సీఎం సొంత జిల్లా కడపలోని అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థకు సంబంధించిన మాస్టర్‌ ప్లాన్‌ ముసాయిదా దశలోనే ఉంది.

ఇళ్ల అదనపు కోటా కోసమే..!

ప్రధానమంత్రి ఆవాస యోజన (పీఎంఏవై) కింద కేంద్ర ప్రభుత్వం యూడీఏల పరిధిలోని పేదలకూ ఇళ్లను కేటాయిస్తోంది. ఈ పథకంలో సొంత స్థలంలో లబ్ధిదారులే ఇళ్లు నిర్మించుకోవచ్చు. రాష్ట్రంలో యూనిట్‌ విలువ రూ.1.80 లక్షలుగా నిర్ణయించారు. ఇందులో కేంద్రం రూ.1.50 లక్షలు, రాష్ట్ర ప్రభుత్వం రూ.30వేలు సమకూరుస్తున్నాయి. పీఎంఏవైలో తొలి విడతగా 2020 డిసెంబరులో రాష్ట్రానికి కేటాయించిన 15.60 లక్షల ఇళ్ల నిర్మాణాలు ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయి. రెండో విడత మరో 14.40 లక్షల ఇళ్లను కేంద్రం నుంచి మంజూరు చేయించుకునే క్రమంలో పట్టణాభివృద్ధి సంస్థల పరిధిని ప్రభుత్వం పెంచుతోందని సమాచారం.

.

ఇదీ చూడండి: గుంటూరు రైతుల వినూత్న ఆలోచన.. వట్టివేర్ల సాగుతో అద్భుతాలు

Last Updated : Dec 27, 2021, 10:34 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.