పోలీసుస్టేషన్ పైనుంచి దూకిన మాజీ సర్పంచ్ - శ్రీకాకుళం జిల్లాలో పోలీసుస్టేషన్ పై నుంచి దూకిన మాజీ సర్పంచ్ వార్తలు
ఇరువర్గాల మధ్య వివాదం కారణంగా మనస్థాపం చెందిన ఓ వ్యక్తి పోలీస్‌స్టేషన్ భవనం పైనుంచి దూకిన ఘటన శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలో జరిగింది. తనను అడ్డుకునేందుకు మరో వ్యక్తి రాగా...తక్షణమే మాజీ సర్పంచ్ అవినాశ్ భవనం పైనుంచి దూకాడు. షేర్‌మహమ్మదాపురంలోని శివాలయం విషయంలో ఇరువర్గాల మధ్య వివాదం తలెత్తింది. ఈ క్రమంలో మనస్థాపానికి గురైన అవినాశ్‌చౌదరి....పోలీస్‌స్టేషన్ పైనుంచి దూకటంతో తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు.
ex sarpanch jumped from police station at srikakulam district