ETV Bharat / city

తెలంగాణ: గ్రేటర్​లో పోటాపోటీగా ఫలితాలొస్తే వీళ్లదే కీలకపాత్ర - జీహెచ్​ఎంసీ ఫలితాలు 2020

గ్రేటర్​ ఎన్నికల లెక్కింపు కొనసాగుతోంది. ఏ పార్టీ మెజార్టీ సాధిస్తుంది.. మేయర్ పీఠం కైవసం చేసుకుంటుంది అనేదానిపైనే అందరి దృష్టి కేంద్రీకృతమయింది. ఒకవేళ పోటాపోటీగా ఫలితాలు వస్తే ఎక్స్‌అఫిషియో సభ్యులు కీలకం కానున్నాయి.

ex-officio-members
ex-officio-members
author img

By

Published : Dec 4, 2020, 2:19 PM IST

జీహెచ్​ఎంసీ ఓట్లు లెక్కింపు కొనసాగుతోంది. పోటాపోటీగా ఫలితాలొస్తే మేయర్ ఎంపికలో ఎక్స్‌అఫిషియో సభ్యులు కీలకపాత్ర పోషించనున్నారు. జీహెచ్‌ఎంసీలో ప్రస్తుతం 45 మంది ఎక్స్అఫిషియో సభ్యులున్నారు. ఇందులో తెరాసకు 31 మంది, ఎంఐఎం 10, భాజపా, కాంగ్రెస్​కు చెరో ఇద్దరు ఎక్స్​అఫిషియో సభ్యులు ఉన్నారు.

ప్రస్తుత జాబితా ప్రకారం 150 మంది కార్పొరేటర్లు, 45 మంది ఎక్స్‌అఫిషియో సభ్యుల సంఖ్య కలిపితే మొత్తం సభ్యుల బలం గల పార్టీయే జీహెచ్‌ఎంసీ మేయర్‌, ఉపమేయర్‌ స్థానాలను గెలిచే వీలుంటుంది.

  • తెరాసకు ప్రస్తుతం 31 మంది ఎక్స్‌అఫిషియో సభ్యుల బలం ఉండగా... ఇంకా 67 స్థానాలను పొందాలి.
  • ఎంఐఎం(మజ్లిస్‌) పార్టీకి 10 మంది ఎక్స్‌అఫిషియో సభ్యులుండగా... ఇంకా 88 డివిజన్లలో గెలవాలి.
  • భాజపాకు ప్రస్తుతం ఇద్దరు ఎక్స్‌అఫిషియో సభ్యులుండగా... ఇంకా 96 స్థానాలు దక్కాలి.
  • కాంగ్రెస్‌కు 1 సభ్యుడు ఉండగా... ఇంకా 97 స్థానాలు కావాలి.

జీహెచ్‌ఎంసీలో ఎక్స్‌అఫిషియో సభ్యుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. మేయర్ ఎన్నిక నోటిఫికేషన్ వరకు ఎక్స్అఫిషియోల నమోదుకు అవకాశం ఉంది. జీహెచ్‌ఎంసీలో ఓటున్న ఎంపీ, ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలకు సభ్యత్వం వస్తుంది. ఎంపీ కేఆర్‌ సురేశ్‌రెడ్డి, నూతనంగా నియామకమైన ముగ్గురు ఎమ్మెల్సీలు ఇప్పటికే ఎక్స్‌అఫిషియో సభ్యత్వానికి దరఖాస్తు చేసుకున్నారు.

ex-officio-members
తెలంగాణ: గ్రేటర్​లో పోటాపోటీగా ఫలితాలొస్తే వీళ్లదే కీలకపాత్ర

ఇదీ చదవండి : ఎస్ఈసీ సర్క్యులర్‌ అమలును నిలిపివేసిన తెలంగాణ హైకోర్టు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.