ETV Bharat / city

తన తండ్రి మొదలుపెట్టిన పావలా వడ్డీ పథకాన్నే జగన్ ఆపేస్తారా?..: సోమిరెడ్డి

తన తండ్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి మొదలుపెట్టిన పావలా వడ్డీ పథకాన్ని... సీఎం జగన్‌ ఆపేస్తారా? అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ప్రశ్నించారు.

ex minister somireddy fires on ycp government
వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డ సోమిరెడ్డి
author img

By

Published : Jul 15, 2020, 1:56 PM IST

వైకాపా ప్రభుత్వంపై మండిపడ్డ సోమిరెడ్డి

తన తండ్రి వైఎస్ రాజశేఖర్​రెడ్డి మొదలుపెట్టిన పావలా వడ్డీ పథకాన్ని... సీఎం జగన్‌ ఆపేస్తారా అంటూ మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్​రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం విడుదల చేసిన జీవోలో ఆ పథకం ప్రస్తావన లేకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు.

సున్నా వడ్డీ పేరుతో కొత్త జీవో 464 తెచ్చి పావలావడ్డీ ఎత్తేశారని... పావలావడ్డీకి రైతులు 3 శాతం చెల్లిస్తే ప్రభుత్వం ఒక్కశాతమే చెల్లించాలన్నారు.

సున్నా వడ్డీని సమస్యల్లోకి నెట్టేసి పావలావడ్డీని ఎత్తేయటం తగదని ఆయన హెచ్చరించారు. పావలావడ్డీ పథకాన్ని వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. రైతులకు సమస్యలు తగ్గించాల్సిన ప్రభుత్వం వాటిని పెంచటం దుర్మార్గమని సోమిరెడ్డి మండిపడ్డారు.

ఇదీ చదవండి:

ముగిసిన రాష్ట్ర కేబినెట్ భేటీ..కీలక అంశాలపై చర్చ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.