మహిళలను 'చేయూత' పేరుతో సీఎం జగన్ రెడ్డి వంచిస్తున్నారని తెదేపా పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ధ్వజమెత్తారు. ప్రతిపక్షనేతగా ఆచరణ సాధ్యం కాని హామీలిచ్చిన జగన్ రెడ్డి.. అధికారంలోకి వచ్చాక బీసీల గొంతు కోశారని దుయ్యబట్టారు. 45 ఏళ్లు దాటిన బీసీ మహిళలకు రూ.3వేల చొప్పున పింఛన్ ఇస్తానని పాదయాత్రలో హామీ ఇచ్చారని.. ఏడాదికి రూ.36వేలు ఇవ్వాల్సి ఉండగా హామీపై మాటతప్పి రూ.18వేలు ఎగ్గొట్టారని ఆరోపించారు. అన్నగా అండగా ఉంటానని నమ్మించి ఓట్లు వేయించుకుని.. పదవి రాగానే కొమ్ములతో కుమ్ముతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మహిళా సంక్షేమంలోనూ చేతివాటం ప్రదర్శిస్తూ అమూలుకు పాలు, అల్లానా కంపెనీకి మాత్రమే మాంసం దక్కాలని ఒప్పందం చేసుకున్నారని మండిపడ్డారు. కమీషన్ల కక్కుర్తి కోసం మహిళల్ని వంచించటం సిగ్గుచేటని విమర్శించారు. స్వయం ఉపాధి కోసం తెదేపా ప్రభుత్వం బీసీ కార్పొరేషన్ ద్వారా రూ.2లక్షలు వరకూ రుణం అందించి అండగా నిలిస్తే.. రూ.18 వేలు ఇచ్చి వ్యాపారాలు చేసుకోండి అనడం విడ్డూరంగా ఉందన్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయనందుకు మహిళలకు బేషరతుగా క్షమాపణ చెప్పాలని ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి:
YSR Cheyutha : అర్హులైన ప్రతీ మహిళకు వైఎస్సార్ చేయూత: సీఎం జగన్
ViJay Thalapathi: రికార్డుల 'మాస్టర్'.. బాక్సాఫీస్ బ్లాక్బాస్టర్