తన మంత్రి పదవి రెన్యువల్ కోసమే నారా లోకేష్‌పై ఆదిమూలపు సురేష్ విమర్శలు గుప్పిస్తున్నారని మాజీమంత్రి జవహర్ మండి పడ్డారు. కనీస అవగాహన లేకుండా లోకేష్ విద్యార్హతలపై విమర్శలు గుప్పించటం తగదని హితవు పలికారు.
కరోనా విజృంభిస్తున్న వేళ.. విద్యార్థుల జీవితాలతో మంత్రి చెలగాటమాడుతున్నారని జవహర్ విమర్శించారు. విద్యార్థులు పరీక్షల్లో ఉత్తీర్ణులై తన కళాశాలలో చేరితేనే డబ్బులు వస్తాయన్నది ఆయన ఆలోచన అని ఆరోపించారు. సీఎం జగన్ భజన చేస్తూ.. విద్యావ్యవస్థను మంత్రి భ్రష్టు పట్టించారని దుయ్యబట్టారు.
ఇదీ చదవండి: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ ఎంత వరకు సబబు ?: చిరంజీవి