వైకాపా ప్రభుత్వంపై తెదేపా నేత, మాజీమంత్రి దేవినేని ఉమ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. వైఎస్ఆర్ సున్నా వడ్డీ పంట రుణాల పథకం పేరును రైతు దగా పథకంగా పేరు మార్చాలని పేర్కొన్నారు. ఎన్నికల ముందు అందరికీ సున్నా వడ్డీ ఇస్తామని చెప్పిన జగన్... ఏడాది తర్వాత జీవో 4530 తెచ్చి రైతులను ముంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రస్తుతం పథకంలో లక్ష రూపాయలలోపు అప్పు తీసుకున్న రైతుకు మాత్రమే సున్నా వడ్డీ వర్తిస్తుందని... అది కూడా రైతు ముందుగా లక్షకు 7వేలు చెల్లించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారని అన్నారు. ఈ క్రాప్ నమోదుతో నిబంధనలతో చాలా మందిని తప్పించారని దుయ్యబట్టారు. తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 3 లక్షల అప్పు తీసుకున్న రైతుకు మొదటి లక్ష రూపాయలకు సున్నా వడ్డీ.. మిగిలిన రెండు లక్షలకు పావలా వడ్డీకి ఇచ్చిందని గుర్తుచేశారు.
ఇదీ చదవండి:
తూర్పుగోదావరి జిల్లా మన్యంలో నీటిలో చక్కర్లు కొట్టిన కొండచిలువ