ETV Bharat / city

విజయసాయిరెడ్డి గారు ... సవాల్​ను స్వీకరిస్తున్నా: అయ్యన్నపాత్రుడు - mp vijay sai reddy

బీసీల సంక్షేమం కోసం తెదేపా హయాంలో ప్రవేశపెట్టిన పథకాలను రద్దు చేసిన చరిత్ర వైకాపా ప్రభుత్వానిదని మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల సంక్షేమంపై చర్చకు సిద్ధమని స్పష్టం చేశారు.

chintakayala ayyanna patrudu
chintakayala ayyanna patrudu
author img

By

Published : Aug 15, 2020, 4:13 PM IST

  • .@VSReddy_MP గారు సంక్షేమం పై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరావు. నీ ట్విట్టర్ సవాల్ ని నేను స్వీకరిస్తున్నాను. ఐదేళ్ల టిడిపి పాలనలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసారు. (1/3) pic.twitter.com/5MKlWpmImU

    — Ayyanna Patrudu (@AyyannaPatruduC) August 15, 2020 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

సంక్షేమంపై చర్చకు సిద్ధమా అని ట్విటర్ వేదికగా వైకాపా ఎంపీ విజయసాయిరెడ్డి విసిరిన సవాల్ ను తెదేపా పొలిట్ బ్యూరో సభ్యుడు అయ్యన్నపాత్రుడు స్వీకరించారు. ఐదేళ్ల తెదేపా పాలనలో బీసీల సంక్షేమానికి పెద్దపీట వేసిందని ఆయన స్పష్టం చేశారు. 23 జిల్లాలు ఉన్న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వైఎస్ ప్రభుత్వం 1825 కోట్లు బీసీ సంక్షేమం కోసం వెచ్చిస్తే... 13 జిల్లాల నవ్యంధ్రప్రదేశ్ లో బీసీ సంక్షేమం కోసం చంద్రబాబు ప్రభుత్వం 43 వేల కోట్లు ఖర్చు చేసిందని గుర్తు చేశారు.

పేద వాడి నోటికాడ ముద్ద లాగేసిన వైకాపా ప్రభుత్వం సంక్షేమం గురించి మాట్లాడే అర్హత ఎక్కడుందని అయ్యన్నపాత్రుడు ప్రశ్నించారు. రిజర్వేషన్లకు కోతపెట్టి, కార్పొరేషన్ నిర్వీర్యం చేసి.. ఆదరణను ఎత్తేసిన వైకాపా ప్రభుత్వం బీసీల గురించి మాట్లాడే అర్హత లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు బీసీల సంక్షేమం కోసం తెదేపా హయాంలో చేపట్టిన కార్యక్రమాలను తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు.

ఇదీ చదవండి:

త్వరలోనే మూడు రాజధానులకు శంకుస్థాపన చేస్తాం: సీఎం జగన్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.