వైకాపా అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, దాడులు పెరిగిపోయాయని మాజీ మంత్రి నిమ్మకాయల చినరాజప్ప విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని ఆరోపించారు. పేదలను బెదిరించి బలవంతంగా భూములు లాక్కుంటున్నారని అన్నారు. అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే 800 మంది తెదేపా కార్యకర్తలపై దాడులు చేశారని.. వేధింపులు తాళలేక ఏడుగురు ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైకాపా అవినీతిని ప్రశ్నిస్తే... అక్రమ కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. తప్పులు ఎత్తిచూపితే సరిదిద్దుకోవాలే కానీ తప్పుడు కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ఆయన నిలదీశారు.
ఇదీ చదవండి: