ETV Bharat / city

నాయిని సతీమణి అహల్య కన్నుమూత

తెలంగాణ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి భార్య అహల్య మరణించారు. ఆమె మృతిపట్ల పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు.

Mourning for Nayini's wife
నాయిని సతీమణికి సంతాపం
author img

By

Published : Oct 27, 2020, 12:03 PM IST

తెలంగాణ మాజీ మంత్రి నాయిని నర్సింహారెడ్డి సతీమణి అహల్య కన్నుమూశారు. జూబ్లీహిల్స్‌ అపోలో ఆస్పత్రిలో చికిత్సపొందుతూ ఆమె మరణించారు. నాయిని నర్సింహారెడ్డి ఈ నెల 22న మరణించగా.. ఆయన మరణించిన వారంలోపే ఆమె ప్రాణాలు కోల్పోయారు. నాయిని సతీమణి అహల్య మృతిపట్ల సభాపతి పోచారం, మంత్రులు ఈటల, తలసాని, కొప్పుల ఈశ్వర్‌ సంతాపం తెలిపారు.

సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ఐదు రోజుల వ్యవధిలోనే భార్యాభర్తలు ఇద్దరూ మరణించడం విషాదకరమని పేర్కొన్నారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

ఇవీ చూడండి: ప్రజల అప్రమత్తతే వారి ఆరోగ్యానికి ప్రధాన రక్ష: ఐపీఎం డైరెక్టర్​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.