ETV Bharat / city

'అలా కాకుండా' ఉండడం అన్నది.. అందరి చేతుల్లో... చేతల్లో ఉంది! - doctor mukkamala apparao interview on corona

కరోనా వైరస్ సోకితే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అసలు అందరూ ఆసుపత్రిలో చికిత్స పొందాలా ? ఇటువంటి ఎన్నో సందేహాలు.. ఆ ప్రశ్నలన్నింటినీ తీర్చేందుకు.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన తెలుగు వైద్య నిపుణులు డాక్టర్ ముక్కామల అప్పారావుతో.. ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి.

etv bharat special inter view with doctor mukkamala apparao on corona virus awareness
తెలుగు వైద్య నిపుణులు డాక్టర్ ముక్కామల అప్పారావుతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి
author img

By

Published : Jul 11, 2020, 5:16 PM IST

Updated : Jul 11, 2020, 8:00 PM IST

తెలుగు వైద్య నిపుణులు డాక్టర్ ముక్కామల అప్పారావుతో ఈటీవీ భారత్ ప్రత్యేక ముఖాముఖి

కరోనా మహమ్మారి నుంచి ప్రతి ఒక్కరూ విజేతలుగా నిలవొచ్చు. ఇందుకు చేయాల్సింది... ఈ వ్యాధి గురించిన భయాన్ని ముందుగా వదిలేయాలి. ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలి. తాము కరోనా వైరస్‌తో పాటు జీవనం గడపడం అనివార్యం అనే భావన పెంపొందించుకోవాలి. ఆలోచన - ఆచరణ - ప్రవర్తనలో మార్పు తీసుకురావాలి. వైద్య పరంగా ఈ వ్యాధికి ముగింపు వచ్చే కంటే... సామాజికంగా మనో నిబ్బరంతో అడుగులు వేయడం ద్వారానే సులభంగా తక్కువ కాలంలో కరోనా నుంచి దూరం కావొచ్చు. ఇదే విషయాలు చెబుతున్నారు.. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రముఖ తెలుగు వైద్య నిపుణులు.. డాక్టర్ ముక్కామల అప్పారావు.

ఈ కరోనా వ్యాధినిర్థరణలో సీటీ స్కాన్‌ పాత్ర, శరీరంలో ఆక్సిజన్‌స్థాయిలను పరిశీలిస్తూ ఉండాల్సిన ఆవశ్యకత, ఆహార – వ్యాయామాలకు సంబంధించి మరెన్నో విలువైన సూచనలు చేశారు. కరోనాకు ముందు కరోనా తర్వాత అనేరీతిలో జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని తెలిపారు. దేశంలో కరోనా వైరస్‌ నిర్ధారణకు చేస్తోన్న పరీక్షల సంఖ్య 3 నెలలతోపోలిస్తే బాగా పెరగడం శుభపరిణామమే... కానీ కరోనాను సమర్థంగా నియంత్రించటానికి అదిమాత్రమే సరిపోదంటున్నారు.. డాక్టర్‌ అప్పారావు. ప్రపంచ వ్యాప్తంగా అంటువ్యాధులు- మహమ్మారులు వణికించినా- వాటి తీవ్రత భారతదేశం వరకు చేరుకోవడంలో ఆలస్యమైనా- ఎక్కువ ప్రభావం చూపించేది భారతీయులనే అనే భావన అంతర్జాతీయంగా ఉందని కరోనా కేసుల్లో ప్రపంచలోనో నెంబర్ 1 స్థానానికి భారతదేశం చేరుకోకుండా ఉంచడం.. ప్రతి ఒక్కరి చేతుల్లోను... చేతల్లోనే ఉందన్నారు.

ఇదీ చదవండి:

ప్రాణం పోవటమే తప్ప వ్యాక్సిన్ లేదు

Last Updated : Jul 11, 2020, 8:00 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.