ETV Bharat / city

ఫైజర్ నుంచి ఆశాభావ ప్రకటన... త్వరలో కొవిడ్ వ్యాక్సిన్ - interview on corona vaccine with Mohan Kishore Kesani

కరోనా వ్యాక్సిన్ 90శాతానికి పైగా సత్ఫలితాలు అందిస్తోందని ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో ప్రజలందరి దృష్టి ఫైజర్ కంపెనీ వైపు మళ్లింది. ఈ తరుణంలో వ్యాక్సిన్ అభివృద్ధి ఏ దశలో ఉంది. ఎప్పటి వరకు ప్రజలకు అందుబాటులోకి రావచ్చు అనే సందేహలను నివృత్తి చేసేందుకు యూఎస్ నుంచి ప్రముఖ డా. మోహన్ కిషోర్ కేసానితో ఈటీవీ భారత్ ముఖాముఖి.

Face to Face on covid vaccine with fizar company
ఫైజర్ నుంచి ఆశాభావ ప్రకటన... త్వరలో కొవిడ్ వ్యాక్సిన్
author img

By

Published : Nov 15, 2020, 11:16 PM IST

ఫైజర్ నుంచి ఆశాభావ ప్రకటన... త్వరలో కొవిడ్ వ్యాక్సిన్

ప్ర. తాము ఉత్పత్తి చేస్తున్న కరోనా వ్యాక్సిన్ 90శాతం పైగా సత్ఫలితాలు అందిస్తోందని ఫార్మా దిగ్గజం ఫైజర్ ప్రకటించింది. దానిని సరఫరా చేసేందుకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు యూఎస్ అధికార వర్గాలు చెబుతున్నాయి. అక్కడ పరిస్థితి ఏంటి..?

జ.వ్యాక్సిన్ మీద చాలా ఆశలున్నాయి. కానీ వ్యాక్సిన్​లోగానే మనం చూడాల్సింది ఏంటంటే.. ప్రజల్లో భయం తగ్గింది. మరణాల రేటు బాగా తగ్గింది. వ్యాధి పెరిగింది, కేసుల సంఖ్య పెరిగింది కానీ.. దాని పట్ల భయం తగ్గింది. ప్రజల్లో కూడా ధైర్యం వచ్చింది. లాక్​డౌన్ ఎత్తివేయడం, మాస్కులు తీయడం వల్ల అక్కడక్కడా కరోనా మళ్లీ పెరుగుతోంది. సామాజిక వ్యాప్తి చెందడం వల్ల అందరికీ వచ్చి.. కోలుకుంటున్నారు. వ్యాక్సిన్ లేకపోతే కొంతకాలానికి.. ఇది బలహీనం అయ్యి... తగ్గిపోతుంది. ఇక ప్రజల్లో ఇమ్యూనిటీ ఏ స్థాయిలో పెరిగిందన్న దాని బట్టి దీని వ్యాప్తి ఉంటుంది. అందుకే కొంతమందిలో రెండోసారి కూడా వస్తోంది. అయితే ఇది ఒకసారి వచ్చి పోతుందా.. తరచుగా మళ్లీ మళ్లీ వస్తుందా అనే దానిపై వైద్యులు తర్జన భర్జన పడుతున్నారు. ఫ్లూ తరహాలో ప్రతి సంవత్సరం వచ్చి పోతుందనే భావన కూడా ఉంది. ఫైజర్ వాళ్లు ఇస్తున్న సమాచారం ప్రకారం చూస్తుంటే వాక్సిన్ ఆశాజనకంగానే ఉంది. కరోనాను ఎదుర్కొనే ఐజీజీ యాంటీబాడీలు వాక్సిన్ తీసుకున్న వారిలో ఉంటున్నాయి. అయితే దీనిపై ఇప్పుడే చెప్పలేం. నిజంగా 90శాతం ఉంటే మంచిదే. కానీ ఆరునెలలు, సంవత్సరం తర్వాత ఎలా ఉంటుందో చెప్పలేం. ఫ్లూ తరహాలో ప్రతీ ఏడాది ఒక వ్యాక్సిన్ డోస్ ఇవ్వాల్సి ఉంటుందా అని కూడా చూడాల్సి ఉంది.

ప్ర. మీరు చెప్పినట్లుగా భయం అయితే తగ్గింది. కానీ కరోనా పూర్తిగా పోయిందనే భరోసా అయితే రాలేదు. వ్యాక్సిన్ వస్తేనే కానీ పూర్తి భరోసా రాదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో 90శాతం పాజిటివ్ రేటు రావడం అనేది సానుకూలాంశంగా చూడొచ్చా..?

జ. కచ్చి తంగా... ! వ్యాక్సిన్ తీసుకున్నామన్న ధైర్యం కూడా జబ్బును ఎదుర్కొనే శక్తినిస్తుంది.

ప్ర. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని రకాల వ్యాక్సిన్స్ తయారవుతున్నాయి.. అవి ఏయే దశల్లో ఉన్నాయి..?

జ. చాలా కంపెనీలున్నాయి. అయితే వీటిలో ముఖ్యంగా కనిపిస్తున్నవి.. ఫైజర్, ఆక్స్​ఫర్డ్, రష్యా వాళ్లు చేస్తున్న స్పుత్నిక్, చైనా తయారు చేస్తున్న వ్యాక్సిన్ ముఖ్యమైనవి. స్పుత్నిక్ విజయవంతం అయిందని చెబుతున్నారు కానీ.. వారి డేటా ప్రపంచంతో పంచుకోలేదు. కాబట్టి వాటిని నమ్మలేం. ఫైజర్, ఆక్స్​ఫర్డ్, మొడర్నా వంటి కంపెనీలు అందరితో సమాచారాన్ని పంచుకుంటున్నాయి. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. ఈ మూడు నాలుగు వ్యాక్సిన్లకు మాత్రం దాదాపుగా ఎఫ్.డి.ఎ అనుమతి వచ్చినట్లే.. ! చిన్నచిన్న దుష్ఫ్రభావాలు మినహా.. ఇవి మంచి పనితీరునే కనబరిచాయి.

ప్ర. వ్యాక్సిన్ల తయారీలో ఎన్నిదశలు... ఎన్నిరకాలున్నాయి. వేటి ప్రభావం మెరుగ్గా ఉంటుంది...?

జ.ఇంజక్షన్ ద్వారా ఇచ్చే.. ఇంట్రామస్క్యులర్ వ్యాక్సిన్ ప్రభావవంతంగా ఉంటుంది. మిగతావన్నీ పరిశీలనా దశలోనే ఉన్నాయి.

ప్ర. దీనిలో నేరుగా వైరస్​నే శరీరంలోకి ఇస్తారా.. ?

జ. వైరస్​లోని ఎం-ఆర్ఎన్ఏ, ప్రోటీన్​ను తీసుకుని ఇంజక్షన్ ద్వారా ఇస్తారు.

ప్ర. వైద్యశాస్త్రం ఇంత అభివృద్ధి సాధించిన తర్వాత కూడా వ్యాక్సిన్ తయారీకి ఇంత సమయం ఎందుకు పడుతోంది...?

జ. మనం రాకెట్ యుగంలో ఉన్నాం కాబట్టి ఆలస్యం అయినట్లు కనిపిస్తోంది కానీ.. వ్యాక్సిన్ తయారీ ప్రక్రియ చాలా వేగంగా జరుగుతోంది. వ్యాక్సిన్ల చరిత్రలో మశూచి, పోలియో వ్యాక్సిన్లు అనేవి అత్యంత విజయవంతమైనవి. పోలియో వ్యాక్సిన్ అనేక రకాలుగా రూపాంతరం చెందింది. ఒక క్రమబద్ధమైన వ్యాక్సిన్ నిర్ధారించడానికి కొన్నేళ్లు పట్టింది. వాటితో పోలిస్తే.. చాలా వేగంగా వచ్చింది. కంప్యూటర్ అనాలసిస్, ఆర్టిఫిషియల్ ఇంటలెజెన్స్ వల్ల ఇంకా చాలా వేగంగా విశ్లేషణ జరిగింది. అలాగే కొన్ని అనుమతులను సడలించడం వల్ల ఈ మాత్రమైనా జరిగింది. మామూలుగా అయితే 7-8ఏళ్లు పడుతుంది.

ప్ర. స్వైన్ ఫ్లూ, ఫ్లూ వంటి వ్యాక్సిన్లు తయారీ తొందరగా పూర్తయింది కదా.. దీనికి ఎందుకింత ఆలస్యం అవుతోంది..?

జ. ఫ్లూ అనేది కొత్త వ్యాక్సిన్ కాదు. వైరస్​లో వస్తున్న మార్పులను బట్టి.. అప్పటికే ఉన్న వ్యాక్సిన్​ను కొద్దిపాటి మార్పులు చేస్తారు. అది సమయం పట్టదు కదా.. హెచ్1ఎన్1( స్వైన్ ఫ్లూ) జబ్బు పరిస్థితి వేరు. దానికి కేవలం న్యూమోనియో వచ్చేది అంతే. కానీ కరోనా జబ్బు పరిధి చాలా ఎక్కువ. దీనిని అర్థం చేసుకోవడమే కష్టంగా ఉంది. కొంతమందికి వచ్చి వెంటనే తగ్గిపోతుంది. కొంతమందికి అకస్మాత్తుగా తిరగబెట్టి ప్రాణాంతకంగా మారుతోంది. కొవిడ్ వల్ల గుండెపోటు, ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డకట్టడం, పక్షవాతం రావడం ఇలా శరీరంలోని అన్ని అవయవాలపై ప్రభావం చూపుతోంది. స్వైన్ ఫ్లూ ఎలా ప్రభావం చూపుతుందన్నదానికి ఒక క్రమపద్ధతి ఉంటుంది. కరోనా పూర్తిగా భిన్నం.

ప్ర. ఏడాదిలోగా వ్యాక్సిన్ రావడం శుభపరిణామం అని చెబుతున్నారు. ఇది మార్కెట్​లో యథావిధిగా వస్తుందా..?. 90శాతం సానుకూలత ఆ తర్వాత కూడా ఉంటుందా..? ఇలా మార్కెట్లోకి వచ్చాక.. విఫలమైన వ్యాక్సిన్లు ఏమైనా ఉన్నాయా..?

జ. ప్రయోగదశ వేరు.. ప్రజల్లోకి రావడం వేరు...! ప్రజల్లో విరివిగా వాడిన తర్వాతనే దాని ప్రభావాన్ని నిర్థారించగలం. సీడీసీ వెబ్​సైట్​లో చూస్తే... కేవలం 20శాతం మాత్రమే ప్రభావం చూపిన వ్యాక్సిన్లు చాలా కనిపిస్తాయి. అమెరికాలో విడుదలయ్యే ఫ్లూ వ్యాక్సిన్ 40శాతం ఫలితాలనే ఇస్తుంది. వ్యాక్సిన్లే కాదు.. మందులు కూడా అన్ని ప్రయోగాలు దాటుకుని.. ఎఫ్.డి.ఎ అనుమతులతో వస్తాయి. కానీ జనాల్లోకి వచ్చిన రెండు మూడేళ్లలో అలాంటి మందులు కనబడకుండా పోతున్నాయి. ప్రస్తుతమున్న సమాచారం ప్రకారం బాగుందని చెప్పగలం. ఏడాది తర్వాత యాంటీబాడీలను పరీశీలించిన తర్వాతే ఇది సమర్థవంతంగా ఉందా లేదా అని చెప్పగలం.

ప్ర. ఈ వ్యాక్సిన్ ఎలా పనిచేస్తుంది..? వైరస్​ను నేరుగా చంపుతుందా...? లేక యాంటీబాడీలను ప్రేరేపిస్తుందా..?

జ. రెండు రకాలుంటాయి. యాంటీబాడీలను ఉత్పత్తి చేయడం కూడా ఒక పద్ధతి. రోగ నిరోధకత అనేక రకాలుంటుంది. హ్యుమరల్ ఇమ్యూనిటీ అనేది శరీరంలో ఏదైనా కొత్త రసాయనం వచ్చినప్పుడు.. యాంటీబాడీలను ఉత్పత్తి చేస్తుంది. సెల్ మీడియెటెడ్ ఇమ్యూనిటీ అనేది ఉంటుంది. ఇందులో టీసెల్స్.. శరీరంలోకి వచ్చిన కొత్త, హానికారక పదార్థాన్ని గుర్తుపెట్టుకుంటాయి. మళ్లీ అలాంటిది వచ్చినప్పుడు.. దానిపై దాడి చేసి తీవ్రతను తగ్గిస్తాయి. ప్రస్తుతం అభివృద్ధి చేస్తున్న వ్యాక్సిన్లలో ఈ రెండూ ఉన్నాయి. యాంటీబాడీ థియరీ ఆధారంగా మోనో క్లోనల్ యాంటీబాడీలను తయారు చేశారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్​నకు అలాంటిది ఇవ్వడం వల్లనే వేగంగా కోలుకున్నారు.

ప్ర. ఈ వ్యాక్సిన్ ఎన్ని డోసులు ఇవ్వాలి. ..?

జ. రెండు డోసులు ఇవ్వాలి. మొదటి డోస్ ఇచ్చిన నెల రోజుల తర్వాత రెండు డోసులు ఇస్తారు. ప్రస్తుతం ప్రయోగ దశలో వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత 90, 160రోజులకు యాంటీబాడీలను, టీసెల్ మెమరీని వాలంటీర్ల నుంచి తీసుకుంటారు. ఇదంతా కూడా నేర్చుకునే ప్రక్రియ. పరిశీలన, పరిశోధనలో వచ్చిన ఫలితాలను బట్టే చికిత్సా విధానం ఎలా ఉండాలి అన్నది నిర్ధారిస్తారు. మొదట్లో మేం.. రక్తాన్ని పలుచబరిచే మందులు, స్టెరాయిడ్లు ఇవ్వాలంటే.. ఎవ్వరూ నమ్మలేదు. ఈ వైరస్​కు ఉన్న చెడు లక్షణం ఏంటంటే.. రక్తం సరఫరాలో అడ్డంకులు సృష్టిస్తుంది. రక్తాన్ని గడ్డ కట్టిస్తుంది. అన్ని అవయవాలకు రక్తాన్ని తీసుకెళ్లడాన్ని నిరోధిస్తోంది. ప్రధానంగా ఊపిరితిత్తులపై ప్రభావం చూపుతోంది. ఊపిరితిత్తుల్లోని గాలి సంచులకు గాలి చేరుతుంది.. కానీ.. వైరస్ వల్ల అడ్డంకులు ఏర్పడి.. రక్తం అక్కడకు చేరడం లేదు. దీనివల్ల ఆక్సిజన్​తో శుభ్రమైన రక్తం ఊపిరితిత్తుల నుంచి గుండెకు చేరడం తగ్గిపోయింది. రక్తం ఊపిరితిత్తుల్లోకి రాకపోవడం వల్ల.. కృత్రిమ వెంటిలేషన్ ఇచ్చినా కూడా ఫలితం లేకుండా పోయింది. ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది తెలుసుకున్న తర్వాతే రక్తాన్ని పలుచబరిచే మందులు ఇవ్వడం మొదలుపెట్టాం. స్టెరాయిడ్స్ ఇచ్చాకనే ఫలితాలు బాగా వచ్చాయి. మేం ముందుగా మొదలుపెట్టాం. ఫలితాలు చూశాక.. అందరూ ఒప్పుకున్నారు.

ప్ర. వ్యాక్సిన్ అందరూ తీసుకోవాలా..? ఏ లక్షణాలున్న వారు.. తీసుకోవాలి..? ఏ వయసుల వారు తీసుకోవాలి.. అనే సందేహాలున్నాయి.?

జ. స్టైరాయిడ్లు తీసుకుంటున్న వారు.. క్యాన్సర్ వంటి క్రానిక్ జబ్బులున్నవారికి కిల్డ్ వ్యాక్సిన్ ఇవ్వొచ్చు. వారు కాకుండా మిగిలిన వారు అంటే.. హై రిస్క్ ఉన్న ఉన్న వారికి ఇవ్వాలి. ఊపిరితిత్తులు, కిడ్నీ సమస్యలున్న వారికి తప్పనిసరి. ఆ తర్వాత జబ్బు ప్రభావం ఎక్కువగా ఉండే పెద్ద వయసు వారికి ఇవ్వాలి. అలాగే వ్యాధితో దగ్గరగా ఉండే వైద్య సిబ్బంది కూడా ముందుగా తీసుకోవాలి.

ప్ర. వ్యాక్సిన్ రావడానికి సమయం పడుతుంది కాబట్టి.. దీనికి దగ్గరగా ఉండే ఇతర వ్యాక్సిన్లు తీసుకోవడం వల్ల కొంతమేర ప్రభావం ఉంటుందని ప్రచారం ఉంది. ఇది నిజమేనా..?

జ. ఇతర వ్యాక్సిన్లు ఏవీ కరోనాను నియంత్రించలేవు. మొదట్లో బీసీజీ వ్యాక్సిన్ తీసుకుంటే కొవిడ్ తగ్గుతుంది అన్నారు... కానీ అది నిరూపితం కాలేదు. ఫ్లూ వ్యాక్సిన్ కూడా ఇన్ ఫ్లూయింజాకు పనిచేస్తుంది కానీ.. వైరస్​ను అరికట్టలేదు.

ప్ర. ఫైజర్ మంచి ఫలితాలు ఇచ్చింది...త్వరలోనే వస్తుందంటున్నారు. ఆక్స్​ఫర్డ్ కూడా అడ్వాన్స్ స్టేజ్​లో ఉంది. మార్కెట్లోకి ఎప్పుడు రావొచ్చనుకుంటున్నారు..?.

జ. జనవరి, ఫిబ్రవరిలో వస్తుందనుకుంటున్నాం. మేం.. ఆ సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతున్నాం. అలాగే ఈ పరిశోధనలకు నిధులు ఇస్తున్న సంస్థలతో కూడా చర్చించాం.. వారు చెప్పిన దాన్ని బట్టి జనవరి, ఫిబ్రవరిలో రావొచ్చు.

ప్ర. అమెరికాలో వ్యాక్సిన్ తయారీ సంస్థలతో సీడీసీ సమన్వయం చేస్తోందా..? పంపిణీకి సంబంధించిన ప్రణాళిక ఏంటి..?

జ. ఫైజర్, ఆక్స్​ఫర్డ్, జాన్సన్ అండ్ జాన్సన్ అనేవి ప్రధానమైనవి. వ్యాక్సిన్ తయారీ ప్రాంతాల నుంచి.. ఆసుపత్రులకు.. వ్యాక్సిన్ ఇచ్చే ప్రాంతాలకు రిఫ్రజిరేటెడ్ కంటైనర్లలో పంపుతారు. అమెరికాలో పెద్దగా సమస్య ఉండదు. అభివృద్ధి చెందని దేశాల్లో.. సాంకేతిక సమస్యలు రావొచ్చు.

ప్ర. ఇంత పెద్ద స్థాయిలో వ్యాక్సిన్​ను.. కొన్ని కోట్ల మందికి కొద్ది సమయంలోనే ఇవ్వాల్సిన పరిస్థితి ఇంతకుముందు ఎప్పుడూ రాలేదు. ఇలాంటి సంక్లిష్టమైన ప్రక్రియలో ఎక్కడైనా పొరపాటు జరిగితే వచ్చే సమస్యలు ఏంటి..? వైరస్ బయటకు వస్తే.. ఇబ్బందులు ఉండవా..?

జ. వ్యాక్సిన్​లో ఉండేది ఎం.ఆర్.ఎన్.ఏ దానివల్ల సమస్య ఉండదు. ఆ రిఫ్రజిరేషన్ మెయింటెయిన్ చేయలేకపోతే.. దాని ప్రభావం తగ్గిపోతుంది కానీ.. అది బయటకు వచ్చి.. నష్టం చేకూర్చే పరిస్థితి ఉండదు. దానివల్ల వ్యాధి ప్రబలే పరిస్థితి ఉండదు కానీ.. సరైన స్థితిలో వ్యాక్సిన్​ను ఇవ్వకపోతే మాత్రం.. వ్యాక్సిన్ పనిచేసే ప్రభావం తగ్గుతుంది.

ప్ర. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత దాని ప్రభావం ఎంతకాలం ఉంటుంది. అమెరికాలో ఇన్ ఫ్లూయెంజాకు ప్రతి సంవత్సరం ఇవ్వాల్సి ఉంటోంది. కరోనాకు కూడా అదే పరిస్థితి రావొచ్చా..? వన్​టైమ్ వ్యాక్సిన్ అవుతుందా..?

జ. అదిప్పుడే చెప్పలేం. వ్యాక్సిన్ ఇచ్చిన తర్వాత ఒక సంవత్సరం వ్యాక్సిన్ తీసుకున్న వారిని పరీక్షించాలి. వారిలో యాంటీబాడీలున్నాయో లేదో చూసిన తర్వాతే చెప్పగలం.

ప్ర. కరోనా భయం తగ్గినా.. వ్యాక్సిన్ వస్తున్నా.. ఏం జరిగినా కానీ.. ఇప్పటికీ ప్రతి ఒక్కరూ మాస్కులు పెట్టుకోవల్సిన పరిస్థితే ఉంది. మాస్కుల నుంచి విముక్తి ఎప్పుడు..?

జ. కొంతకాలం మాస్కుల భయం అందరిలోనూ ఉంటుంది. జాగ్రత్తగా ఉండేవాళ్లు ఎప్పుడూ మాస్కులు పెట్టుకుంటారు. అజాగ్రత్తగా ఉండేవాళ్లు ఇండియాలో అయినా..అమెరికాలో అయినా ఉంటారు. ఇక్కడ ప్రెసిడెంట్​లే పెట్టుకోలేదు. కేసుల సంఖ్య బాగా తగ్గిపోయి.. వందలోపు వస్తే... అప్పుడు మాస్కులు వాడటం తగ్గిస్తారు. మెజారిటీ జనాలకు రోగనిరోధకత వస్తే.. మాస్కులు తగ్గించొచ్చు. కానీ ఆ రోజు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. వ్యాక్సిన్ వచ్చిన ఓ మూడునెలల వరకూ పెట్టుకోవడం మంచిది.

ప్ర. అందరికీ రోగనిరోధకత వచ్చే హెర్డ్ ఇమ్యూనిటీ ద్వారా కరోనా అదుపులోకి వస్తుందా..? వ్యాక్సిన్ ద్వారా త్వరగా అదుపులోకి వస్తుందా..?

జ. హెర్డ్ ఇమ్యూనిటీ అనేది చాలా కాలం పడుతుంది. ఈ క్రమంలో ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోవచ్చు. దాని కంటే... వ్యాక్సిన్ ఇవ్వడమే ఉత్తమం.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.